కరీంనగర్ టౌన్, వెలుగు: బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన బాలల వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలల సంరక్షణ చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని అన్నారు.
‘స్నేహిత’ కార్యక్రమం ద్వారా స్కూళ్లలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ బాలల హక్కులను వివరిస్తున్నామని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా బాలబాలికలు 1098 హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అనంతరం పిల్లల దత్తత పోస్టర్‌ను ఆవిష్కరించి, బాలల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
అనంతరం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణికుముదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజి వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్‌వో వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో శ్రీనివాస్, డీసీవో జగదీశ్వర్, సీబ్ల్యూసీ చైర్‌పర్సన్ ధనలక్ష్మి, డీడబ్ల్యూవో సరస్వతి, డీఐఈవో గంగాధర్, ఎంఈవో ప్రభాకర్‌రావు, పాల్గొన్నారు.
