కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చుకుందాం : కలెక్టర్ పమేలా సత్పతి

 కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చుకుందాం : కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. నషా ముక్త్ భారత్ అభియాన్‌‌‌‌‌‌‌‌లో భాగంగా సిటీలోని కరీంనగర్  క్లబ్ ఎదుట రోడ్డుపై గురువారం ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ మహిళలకు, కాలేజీ విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను తెలియజేసేందుకే ముగ్గుల పోటీలు నిర్వహించినట్లు చెప్పారు. డ్రగ్స్‌‌‌‌‌‌‌‌తో యువత, విద్యార్థులు జీవితాన్ని అంధకారంలోకి నెట్టుకుంటున్నారన్నారు. 

కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి 

రామడుగు/గంగాధర, వెలుగు: రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మి మద్దతు ధర పొందాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. రామడుగు మండలం వెదిర రైతువేదిక ప్రాంగణంలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి గురువారం ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం క్వింటాలు ఏ గ్రేడ్ రకానికి రూ.2,389, సాధారణ రకం ధాన్యానికి రూ.2,369 మద్దతు ధరి ఇస్తోందన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు సెంటర్లలో రైతుల కోసం అన్ని వసతులు కల్పిస్తోందన్నారు. సన్నరకం వడ్లు పండించే రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అదనంగా రూ.500 బోనస్​గా ఇస్తోందన్నారు. అనంతరం రామడుగు, గంగాధర మండలాల్లోని పలు మండలాల్లో కొనుగోలు సెంటర్లను ఎమ్మెల్యే ప్రారంభించారు.