డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి : కలెక్టర్ పమేలా సత్పతి

డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి : కలెక్టర్ పమేలా సత్పతి
  • కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ టౌన్, వెలుగు: యువత, విద్యార్థుల భవిష్యత్‌‌‌‌‌‌‌‌ను నాశనం చేసే మత్తుపదార్థాల నిర్మూలనకు పకడ్బందీ చర్యలు తీసుకొని కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ పమేలాసత్పతి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో పోలీస్, ఎక్సైజ్, శిశు సంక్షేమ, వైద్య శాఖల అధికారులతో నిర్వహించిన జిల్లాస్థాయి నార్కో కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో సీపీ గౌస్ ఆలంతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగంతో కలిగే దుష్పరిణామాలపై స్కూళ్లు, కాలేజీలు, బహిరంగ ప్రదేశాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. 

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో రోడ్ల పక్కన ఉన్న స్కూళ్లు, పాన్ షాపుల్లో తనిఖీలు చేయాలని సూచించారు. విద్యార్థుల ప్రవర్తనను నిత్యం గమనించాలని టీచర్లు, తల్లిదండ్రులకు సూచించారు. సీపీ మాట్లాడుతూ మత్తు పదార్థాల నిర్మూలనకు నిత్యం గస్తీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం నశా ముక్త్ భారత్ అభియాన్ క్యూ ఆర్ కోడ్ పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం సప్తగిరికాలనీ పీహెచ్‌‌‌‌‌‌‌‌సీలో నిర్వహించిన ఆరోగ్యమహిళ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రమేశ్‌‌‌‌‌‌‌‌బాబు, డీడబ్ల్యూవో సరస్వతి, డాక్టర్ సనా, వైద్య సిబ్బంది, తదితరులు 
పాల్గొన్నారు.