రైతు రుణాల ప్రక్రియలో వేగం పెంచండి : ప్రశాంత్ జీవన్ పాటిల్

రైతు రుణాల ప్రక్రియలో వేగం పెంచండి : ప్రశాంత్ జీవన్ పాటిల్
  • కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

సిద్దిపేట రూరల్, వెలుగు : రైతులకు రుణ మాఫీ, కొత్త రుణాలు, పాత క్రాప్ లోన్ రెన్యూవల్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ లో బ్యాంకు అధికారులు, వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  వివిధ బ్యాంకుల్లో పెండింగ్ ఉన్న రైతు రుణమాఫీ నగదును వెంటనే రైతులకు అందజేయాలని బ్యాంకర్లకు సూచించారు. అర్హత కలిగిన రైతులకు వెంటనే రుణాలు మంజూరు చేయాలన్నారు.

గ్రామాల్లో ప్రజాప్రతినిధులతో కలిసి రైతు వేదికల్లో సమావేశాలు నిర్వహించి క్రాప్ లోన్లు తీసుకూనేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. అడిషనల్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడుతూ.. రెండో విడత వీధి వ్యాపార రుణాలను మునిసిపాలిటీ పరిధిలోని 1384మందికి మెప్మా అధికారుల సహయంతో అందించాలని సూచించారు. సమావేశంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ సత్యజిత్, డీఏఓ శివప్రసాద్, డీఆర్డీఏ పీడీ జయదేవ్ ఆర్యా, ఎస్బీఐ ఆర్ఎం అరుణ జ్వోతి, యూబీఐ ఆర్​హెచ్​వికాస్, ఏపీజీవీబీ ఆర్ఎం ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు.