- ప్రజావాణిలో వినతులు స్వీకరించిన కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి టౌన్, వెలుగు : జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. సంగారెడ్డి కలెక్టరేట్లో ప్రజల నుంచి 76 దరఖాస్తుదారులు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ అర్జీపై తక్షణ చర్యలు తీసుకొని సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్ చంద్రశేఖర్, మాధురి, డీఆర్వో పద్మజా రాణి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
జీడి సారయ్యపై చర్యలు తీసుకోవాలి
బ్రాహ్మణులను అవమానిస్తూ పాట పాడిన జీడి సారయ్యపై చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి మండల బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ ప్రావీణ్యకు వినతిపత్రం అందజేశారు. వైకుంఠపురం ఆలయ ప్రధాన అర్చకుడు కందాడై వరదాచార్యుల ఆధ్వర్యంలో సమాజం పెద్దలు కలెక్టర్ ను కలిశారు. వారు మాట్లాడుతూ కేవలం ఒక వ్యక్తిని కాకుండా బ్రాహ్మణ సమాజాన్ని మొత్తం కించపరిచేలా ఆ పాట ఉందన్నారు.
సారయ్యపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని, భవిష్యత్ లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో జగన్మోహన్ శర్మ, మోతుకూరి రాము, వైద్య ప్రభాకరశర్మ, విజయసారథి, రవిశంకర్ కుమార్ ఉన్నారు.
