ప్రాజెక్టుల భూ సేకరణ పనులు స్పీడప్​ చేయాలి : కలెక్టర్​ ప్రియాంక అల

ప్రాజెక్టుల భూ సేకరణ పనులు స్పీడప్​ చేయాలి :  కలెక్టర్​ ప్రియాంక అల
  •     భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ ప్రియాంక అల

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో చేపడుతున్న ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన భూ సేకరణ పనులు స్పీడప్​ చేయాలని కలెక్టర్​ డాక్టర్​ ప్రియాంక అల అధికారులకు సూచించారు. కలెక్టరేట్​లో భూ సేకరణ, సింగరేణి, రెవెన్యూ, సర్వే అండ్​ ల్యాండ్​ రికార్డ్స్, ఇరిగేషన్​ శాఖల అధికారులతో బుధవారం నిర్వహించిన రివ్యూ మీటింగ్​లో ఆమె మాట్లాడారు. సీతారామ ఎత్తిపోతల స్కీం, సీతమ్మ సాగర్​ మొదట, రెండో, మూడో దశ ప్రాజెక్టులకు భూ సేకరణ ఎంత వరకు వచ్చిందనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. పులుసుబొంత ప్రాజెక్ట్, బీటీపీఎస్​ రైల్వేలైన్​ ప్రాజెక్ట్​లకు సంబంధించి భూ సేకరణ

 కోర్టు కేసులపై చర్చించారు. సీతారామ లిఫ్ట్​ ఇరిగేషన్​ భూ నిర్వాసితులకు చెల్లించే నష్ట పరిహారం రూ. 75కోట్లు త్వరిత గతిన చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. సీతమ్మ సాగర్​ ప్రాజెక్ట్​ కు సంబంధించి పెండింగ్​లో ఉన్న దుమ్ముగూడెం, చర్ల మండలాల్లోని ఎనిమిది గ్రామాల్లో భూ సేకరణ పనులను స్పీడ్​గా చేపట్టాలని సూచించారు. పనులకు సంబంధించి నివేదికలను వారంలో భద్రాచలం ఆర్డీఓకు అందజేయాలని తహసీల్దార్లను ఆదేశించారు.

పులుసుబొంత ప్రాజెక్ట్​ భూ సేకరణకు సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహించి నివేదికలను ఇవ్వాలన్నారు. సమావేశంలో డీఆర్​ఓ రవీంద్రనాథ్​, బీటీపీఎస్​ సీఈ బిచ్చన్న, ఇరిగేషన్​ఈఈ అర్జున్, ఆర్అండ్​బీ ఈఈ వెంకటేశ్వర్లు, స్పెషల్​ డిప్యూటీ కలెక్టర్​ సుమ, ఎన్​పీడీసీఎల్​ ఎస్ఈ రమేశ్ పాల్గొన్నారు.