నామినేషన్ ప్రక్రియలో తప్పులు ఉండొద్దు : కలెక్టర్ రాహుల్ రాజ్

నామినేషన్ ప్రక్రియలో తప్పులు ఉండొద్దు :  కలెక్టర్ రాహుల్ రాజ్
  •     కలెక్టర్ రాహుల్ రాజ్ 

రామాయంపేట, వెలుగు: నామినేషన్​ ప్రక్రియలో తప్పులు లేకుండా చూడాలని కలెక్టర్​రాహుల్​రాజ్​అన్నారు. శుక్రవారం రామాయంపేట మున్సిపాలిటీ ఆఫీస్ ను సాధారణ పరిశీలకులు రవికిరణ్​తో కలిసి సందర్శించారు. నామినేషన్ పత్రాలను, వివిధ రిజిస్టర్లను పరిశీలించి, ఎన్నికల సిబ్బందికి సలహాలు సూచనలు అందించారు. ఎన్ని వార్డులు  ఉన్నాయి,  నామినేషన్లు ఎన్ని వచ్చాయని ఎన్నికల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. 

కలెక్టర్ మాట్లాడుతూ.. నామినేషన్ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి తీసుకోవాలన్నారు. నామినేషన్ పత్రాలతో పాటు జత చేసే జిరాక్స్ లను సరిచూసి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో మహిపాల్​రెడ్డి, మున్సిపల్ కమిషనర్, తదితరులు ఉన్నారు.

రహదారుల పెండింగ్ పనులు పూర్తి చేయాలి 

మెదక్ ​టౌన్: రహదారుల పెండింగ్ పనులు పూర్తి చేసి, రోడ్డు ప్రమాదాలను నివారించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రహదారుల, పోలీస్, ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రహదారులపై గుంతలు పూడ్చాలని, రోడ్లపై సీసీ  కెమెరాలు, సిగ్నల్స్, సైన్ బోర్డులు, యూ- టర్న్​లు ఏర్పాటుచేయాలన్నారు. 

మత్తు పదార్థాలపై నిఘా పెట్టాలని, స్కూల్​, కాలేజీ స్థాయిలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పోక్సో, బాల్యవివాహాల నిషేధ చట్టం, హెల్ప్ లైన్ నంబర్ల పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏఎస్పీ మహేందర్, ఈఈ వేణు, డీడబ్ల్యువో హేమభార్గవి, డీఎస్పీ ప్రసన్న కుమార్​, రోడ్డు రవాణా అధికారులు, సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు.