విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

 విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
  • కలెక్టర్ రాహుల్ రాజ్ 

తూప్రాన్, వెలుగు : విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని కలెక్టర్ రాహుల్ రాజ్ టీచర్లకు సూచించారు. బుధవారం మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని రావెల్లిలో మహాత్మాజ్యోతిబాఫూలే బాలికల పాఠశాల, కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ గురుకుల పాఠశాల, కళాశాలల్లో చదువుకునే  విద్యార్థులకు నాణ్యమైన భోజం అందించాలన్నారు. విద్యార్థులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా చూడాలని చెప్పారు. విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం వంట గదిని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

తూప్రాన్ లో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ ను సందర్శించి బిల్డింగ్ మ్యాపును పరిశీలించారు. తూప్రాన్ మున్సిపల్ పరిధిలో నూతన పీహెచ్​సీ నిర్మాణం కోసం స్థల పరిశీలన చేశారు. ఆయన వెంట తూప్రాన్  ఆర్డీవో జయచంద్రరెడ్డి, తహసీల్దార్ చంద్ర శేఖర్ రెడ్డి, కమిషనర్ గణేశ్ రెడ్డి, ఎంపీడీవో షాలిక, పీఆర్  ఏఈ మధు, డిప్యూటీ తహసీల్దార్ శ్రీకాంత్, ఆర్ఐ ప్రేమ్, సిబ్బంది ఉన్నారు.