- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్
పాపన్నపేట, వెలుగు: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. శనివారం పాపన్నపేట మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్11న మొదటి విడత పోలింగ్ ఉన్నందున 10న ఎన్నికల సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకోవాలని ఆదేశించారు.
గ్రామాల్లో వంద శాతం ఓటింగ్ సాధించిన పంచాయతీలకు బహుమతులు అందజేస్తామన్నారు. మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్లో పదో తరగతి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యా సామర్థ్యాలను పరీక్షించిన పలు సూచనలు సలహాలు చేశారు. పదో తరగతిలో మెరుగైన ఫలితాలే లక్ష్యంగా విద్యాశాఖ అధికారులు పనిచేయాలన్నారు.
ఎన్నికలు పూర్తయ్యే వరకు కోడ్ అమలు
మెదక్ టౌన్ : మెదక్ జిల్లాలో పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఏకగ్రీవ పంచాయతీల్లోనూ ఎన్నికల కోడ్ అమల్లోనే ఉంటుందన్నారు. క్యాంప్ ఆఫీసు నుంచి ఆర్వోలు, ఆర్డీవోలు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్నిర్వహించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.
