
మల్హర్, వెలుగు: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జయశంకర్భూపాలపల్లి కలెక్టర్ కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. శనివారం తాడిచెర్ల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సేవలపై ఆరా తీశారు. రోగులతో మాట్లాడి అందిస్తున్న వైద్యం, మందుల లభ్యత, సిబ్బంది హాజరు, వైద్య సేవలు గురించి ప్రజల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న మందుల స్టాక్, శానిటేషన్ పరిస్థితులు, రికార్డుల నిర్వహణ, ఓపి రిజిస్టర్ తదితర అంశాలను సమీక్షించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి తదితరులున్నారు.