టెన్త్​క్లాస్​ఎగ్జామ్స్​కు పకడ్బందీ ఏర్పాట్లు : రాజర్షి షా

టెన్త్​క్లాస్​ఎగ్జామ్స్​కు పకడ్బందీ ఏర్పాట్లు : రాజర్షి షా

ఆదిలాబాద్, వెలుగు: ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించే టెన్త్​క్లాస్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్‌ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శనివారం సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ.. పరీక్షలకు ఈసారి నిమిషం నిబంధనలు ఎత్తేశారని, 5 నిమిషాల వరకు విద్యార్థులను అనుమతించాలని సూచించారు.

పేపర్ లీక్​కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, జిరాక్స్ సెంటర్లను మూసివేయాలన్నారు. పరీక్షలకు సంబంధించిన ప్రతి అంశం సీసీ కెమెరాల నిఘాలోని జరగాలని ఆదేశించారు. స్టూడెంట్లకు అసౌకర్యం కలగకుండా తాగునీరుతోపాటు అన్ని సదుపాయాలు ఏర్పాటుచేయాలని, టాయిలెట్స్ శుభ్రంగా ఉంచాలన్నారు. 

5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతి

మంచిర్యాల: ఎగ్జామ్స్ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశామని మంచిర్యాల డీఈఓ యాదయ్య తెలిపారు. శనివారం కలెక్టర్ బదావత్ సంతోష్ పరీక్షల నిర్వహణపై జూమ్ మీటింగ్ ద్వారా చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్​మెంటల్ అధికారులకు పలు సూచనలు ఇచ్చారన్నారు. ఎగ్జామ్స్ మార్నింగ్ 9.30 నుంచి 
మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. స్టూడెంట్లను 9.35 గంటల వరకు మాత్రమే సెంటర్ లోపలికి అనుమతిస్తామన్నారు. జిల్లావ్యాప్తంగా 4,790 మంది బాయ్స్, 4,508 మంది గర్ల్స్ కలిపి మొత్తం 9,298 మంది రెగ్యులర్ స్టూడెంట్లు ఎగ్జామ్స్ రాయనున్నారని తెలిపారు. జిల్లాలో 52 సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు.

టెన్త్ ఎగ్జామ్స్​కు ఏర్పాట్లు పూర్తి

నేరడిగొండ: టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు  నేరడిగొండ ఎంఈఓ భూమారెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని ఎంఈఓ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ.. మండలంలో రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, జడ్పీ హైస్కూల్ లో 180 మంది, గిరిజన ఆశ్రమ పాఠశాల లక్కంపూర్ పరీక్షా కేంద్రంలో 200 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయనున్నట్లు చెప్పారు. మాస్ కాపీయింగ్ కు పాల్పడకుండా జాగ్రత్తలు తీసుకున్నామని,  విద్యార్థులు నిర్ణీత సమయంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.