‘ఇస్కాన్’ ఆధ్వర్యంలో రైతులకు భోజనం : కలెక్టర్ రాజర్షి షా

‘ఇస్కాన్’ ఆధ్వర్యంలో రైతులకు భోజనం : కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: రైతుల కోసం ఆదిలాబాద్​మార్కెట్ యార్డులో ఇస్కాన్​ ట్రస్ట్​ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమాన్ని గురువారం కలెక్టర్​ రాజర్షి షా ఎమ్మెల్యే పాయల్​శంకర్​, డీసీసీబీ చైర్మన్​అడ్డి భోజారెడ్డి, ట్రస్ట్​ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. 

రైతులకు రూ.10 కే మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఒక్క పూట భోజనానికి ఒక్కొక్కరికి రూ.35 చొప్పున ఖర్చవుతుండగా.. రూ.15 మార్కెటింగ్ శాఖ, రూ.10  ఇస్కాన్ ట్రస్ట్ , రూ.10  రైతుల కాంట్రిబ్యూషన్ తో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.  అనంతరం రైతులతో కలిసి భోజనం చేశారు. జిల్లా మార్కెటింగ్ అధికారి గజానంద్ తదితరులు పాల్గొన్నారు.

క్రీడల్లో రాణిస్తే ఉపాధి అవకాశాలుంటయ్​

యువత క్రీడారంగంలో రాణిస్తే ఉపాధి అవకాశాలుంటాయని, వాటిని అందిపుచ్చుకోవాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదిలాబాద్​న్యూ హౌసింగ్ బోర్డులోని మహాత్మా జ్యోతిబా పూలే కళాశాలలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, హ్యాండ్​బాల్​తదితర పోటీలు గురువారం ముగిశాయి.  ముగింపు వేడుకలకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై,  విజేతలకు ట్రోఫీలు అందజేశారు. క్రీడల్లో రాణించడం ద్వారా స్పోర్ట్స్‌‌‌‌ కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. డీవైఎస్ వో శ్రీనివాస్, డీఐఈవో గణేశ్​జాదవ్ తదితరులున్నారు.