స్క్రూటినీ పాదర్శకంగా నిర్వహించాలి : కలెక్టర్ రాజర్షి షా

 స్క్రూటినీ పాదర్శకంగా నిర్వహించాలి : కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్, వెలుగు :  జిల్లాలో రెండవ విడత గ్రామపంచాయతి ఎన్నికల నామినేషన్, మొదటి విడత స్క్రూటినీ ప్రక్రియలు పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఆదివారం మావల మండల ఎంపీడీవో కార్యాలయం, ఇంద్రవెల్లి, ఉట్నూర్ మండలాల గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఎన్నికల ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  ఆదిలాబాద్ రూరల్, మావల, బేల, జైనథ్, సాత్నాల, భోరాజ్, తాంసీ, భీంపూర్ మండలాల్లో రెండవ విడత నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు.

 అభ్యర్థులందరికీ హెల్ప్‌‌‌‌డెస్క్‌‌‌‌ల ద్వారా పూర్తి మార్గదర్శకం, అవసరమైన పత్రాల వివరాలు స్పష్టంగా అందించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులు ఎదుర్కొనే సందేహాలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో మావల మండల ప్రత్యేక అధికారి రాజలింగు, తహసీల్దార్ వేణు, ఎంపీడీఓ కృష్ణవేణి, ఇంద్రవెల్లి ఎంపీడీవో జీవన్ రెడ్డి, ఉట్నూర్ ఎంపీడీవో రామ్ ప్రసాద్, పాల్గొన్నారు.