పరీక్షలంటే భయపడొద్దు : ​ రాజర్షి షా

పరీక్షలంటే భయపడొద్దు : ​ రాజర్షి షా

మెదక్ టౌన్, వెలుగు: స్టూడెంట్స్​ పరీక్షలంటే భయపడొద్దని, ఇష్టంతో చదివి మంచి మార్కులు సాధించాలని కలెక్టర్​ రాజర్షి షా సూచించారు. శనివారం మెదక్​ పట్టణంలోని టీఎన్జీవో భవనంలో టెన్త్​ స్టూడెంట్స్​కు ప్రేరణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ.. స్టూడెంట్స్​మంచి మార్కులు సాధించేలా టీచర్లు ప్రోత్సహించాలన్నారు. హాస్టళ్లలో ఉండే స్టూడెంట్స్​ కోసం  ప్రత్యేక స్టడీ అవర్స్, ట్యూటర్లను నియమించి చదివించాలని సూచించారు.

టెన్త్​ సబ్జెక్ట్​లను నిర్లక్ష్యం చేయవద్దని ఇవి కేంద్ర ,రాష్ట్ర స్థాయి లో ఉండే సివిల్స్, గ్రూప్ 1,2,3 లాంటి పరీక్షలు ఉపయోగపడతాయని చెప్పారు.  టీవీ , ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా ఉండి బాగా చదవాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్​బీసీ సంక్షేమ అధికారి నాగరాజు గౌడ్,  నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నరేందర్​, జనరల్​సెక్రెటరీ రాజ్​కుమార్,  శ్రీనివాస్​, హాస్టల్ వార్డెన్లు, స్టూడెంట్స్​ పాల్గొన్నారు.