హాస్టల్, రెసిడెన్షియల్ స్కూళ్ల తనిఖీ

హాస్టల్, రెసిడెన్షియల్ స్కూళ్ల తనిఖీ

నిజామాబాద్ సిటీ, వెలుగు: నిజామాబాద్ లోని వినాయక నగర్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని, మోపాల్ మండలం కంజర మహాత్మా జ్యోతి బాపూలే బాలుర రెసిడెన్షియల్ స్కూల్​ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, డార్మెటరీ, స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్, టాయిలెట్స్, ఆఫీస్, స్టాఫ్ రూమ్ పరిశీలించారు.

 స్టోర్ రూమ్ లో  సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు ప్రతీరోజు మెనూ ప్రకారం రుచికరమైన భోజనం అందించాలన్నారు. బోధన సిబ్బంది హాజరు, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి భోజన, వసతి, రోజువారి దినచర్యపై ఆరా తీశారు.

 జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ స్కూల్ ఆవరణలో నూతనంగా నిర్మించిన భవన సముదాయం, డార్మెటరీని సందర్శించారు.   వినాయకనగర్ సంక్షేమ వసతి గృహం విద్యార్థినులు నిత్యం బోర్గం(పి) పాఠశాలకు వెళ్లి వచ్చేందుకు రవాణా వసతి లేక ఇబ్బందులు పడుతున్నారని, స్కూల్​ సమయంలో ఉదయం, సాయంత్రం బస్సు సదుపాయం కల్పించాలని హాస్టల్ నిర్వాహకులు కోరడంతో కలెక్టర్ సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామన్నారు.

 కలెక్టర్ వెంట జిల్లా సాంఘిక సంక్షేమ అభివృద్ధి అధికారిణి నిర్మల, సహాయ సంక్షేమ అధికారి భూమయ్య, మోపాల్ ఎంపీడీఓ రాములు తదితరులు
 ఉన్నారు.