
జనగామ అర్బన్, వెలుగు: జిల్లాలో ఆన్లైన్ జీరో పర్మిట్సిస్టమ్ను పక్కాగా అమలు చేయాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఇసుక, కంకర తదితర ఖనిజ వనరులకు సంబంధించి ఆన్లైన్ జీరో పర్మిట్సిస్టం, టీజీ ఎండీసీ ద్వారా ఇసుక అనుమతులు తీసుకునే విధానంపై మైనింగ్, టీజీ ఎండీసీ, ఇరిగేషన్, పంచాయతీ రాజ్తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణా పైన ప్రభుత్వం కట్టు దిట్టమైన చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు.
ఆన్లైన్ జీరో పర్మిట్‌ను అధికారులు తప్పకుండా అమలు చేయాలన్నారు. రహదారుల రిపేర్లు ఉంటే వెంటనే పూర్తి చేయాలన్నారు. అనంతరం ఆయిల్పామ్విస్తీర్ణం పెంపుపై ఉద్యానశాఖ ఆధ్వర్యంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం జనగామ మండలం ఓబుల్ కేశవపూర్ లోని జడ్పీ హైస్కూల్ ను కలెక్టర్ సందర్శించి డిజిటల్ బోధన తీరును విద్యార్థుల సామర్థ్యాలను కలెక్టర్పరిశీలించారు. మెనూ పాటించాలని, యూనిఫాం తప్పనిసరని, విద్యార్థులకు కెరీర్ కౌన్సిలింగ్ఇవ్వాలని ఆదేశించారు. సమీక్షలో మైనింగ్‌శాఖ ఏడీ విజయ్‌కుమార్, పట్టుపరిశ్రమ శాఖ అధికారి శ్రీధర్, డీఏవో రామారావు నాయక్, సహకారి శాఖ అధికారి రాజేందర్ రెడ్డి, మేనేజర్ శంకర్, డీఈవో భోజయ్య పాల్గొన్నారు.