జనగామ, వెలుగు: వడ్ల కొనుగోళ్లలో రూల్స్‌కు విరుద్ధంగా వ్యహరిస్తే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జనగామ కలెక్టర్ సందీప్కుమార్ ఝా హెచ్చరించారు. 'రైస్ మిల్లులకు నోటీసులు' శీర్షికతో వెలుగులో వచ్చిన వార్తకు స్పందించిన ఆయన ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. నాణ్యతను సాకుగా చూపి రైతులను ఇబ్బందులకు గురి చేయకూడదని ఆయన మిల్లర్లకు సూచించారు. తూకం ఎక్కువ, లారీల అన్లోడింగ్ సరైన సమయంలో చేయకుంటే బ్యాంకు గ్యారెంటీలను జప్తు చేస్తామని తెలిపారు.
సీఎంఆర్ కేటాయింపులు కూడా రద్దు చేస్తామని చెప్పారు. అవసరమైతే మిల్లులను కూడా స్వాధీనం చేసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇదిలాఉండగా, జనగామ కలెక్టరేట్ స్థలంలో ఏర్పాటైన టీ స్టాల్ తొలగింపును హైకోర్టు సమర్ధించిందని కలెక్టర్ సందీప్కుమార్ ఝా తెలిపారు. భూ కేటాయింపులు లేకుండా ఏర్పాటు చేసినందున ఆక్రమణ కిందకే వస్తుందని హైకోర్టు తెలిపిందన్నారు. ఈ స్టాల్‌కు వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ సమీపంలో తాత్కాలిక లైసెన్స్‌తో కేటాయించాలని ఆదేశించిందని తెలిపారు. అపరిచిత వ్యక్తులు కలెక్టరేట్‌కు వస్తూ ఆఫీసుల్లోకి వెళ్లి జోక్యం చేసుకుంటున్నందున కలెక్టరేట్‌లోనికి 'ఎంట్రీ, ఎగ్జిట్ ప్రొటోకాల్' అమలు చేస్తున్నామని చెప్పారు.
