మరో పేపర్ లీక్!  ఈసారి పారామెడికల్ పేపర్లు..రాజస్థాన్ RPMC ఎగ్జామ్ రద్దు

మరో పేపర్ లీక్!  ఈసారి పారామెడికల్ పేపర్లు..రాజస్థాన్ RPMC ఎగ్జామ్ రద్దు

దేశంలో ఎగ్జామ్ పేపర్ల లీక్ పరంపర కొనసాగుతోంది. నీట్ యూజీ ఎగ్జామ్ పేపర్ లీక్  తర్వాత మహారాష్ట్ర టెట్ .. తాజాగా రాజస్థాన  RPMC ఎగ్జామ్ పేపర్లు.. రాజస్థాన్ లో పారామెడికల్ ఎగ్జామ్ కు ముందే  క్వశ్చన్ పేపర్లు లీక్ కావడం ఆందోళనకు గురిచేస్తుంది. 

రాజస్థాన్  యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్(RUHS) నిర్వహిస్తున్న పారామెడికల్ పరీక్షలకు ముందు  పేపర్ లీక్ అయింది.  అక్రమాలకు పాల్పడుతున్న ముఠాను జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.  ఝునునులోని ఎస్ కరణ్ కాలేజీ పారామెడికల్ డిపార్టుమెంట్  హెడ్ తో సహా నలుగురిని అరెస్ట్ చేశారు. పరీక్షా హాలులోనే మోసానికి పాల్పడేందుకు కాలేజీ లోని స్టాఫ్ తో కలిసి కొందరు ప్లాన్ చేసినట్లు  విచారణలో తేలింది. 

ALSO READ : ఇథనాల్ బ్లెండింగ్ ప్రయోగం మాత్రమే.. దీని ఫలితం వచ్చే ఏడాదికి తెలుస్తుంది

జూన్ 29న ఆర్ యూ హెచ్ఎస్ పారామెడికల్ ఎగ్జామ్స్ సమయంలో సహాయం చేస్తామని విద్యార్థుల నుంచి ఓ ముఠా భారీగాడబ్బులు వసూలు చేస్తోందని జూన్ 27న పోలీసులకు పక్కా సమాచారం అందడంతో స్పెషల్ టీం ద్వారా ఎగ్జామ్ లీక్ రాకెట్ గుట్టు రట్టు చేసినట్లు  జైపూర్ వెస్ట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రశాంత్ కిరణ్ తెలిపారు.