ఇథనాల్ బ్లెండింగ్ ప్రయోగం మాత్రమే.. దీని ఫలితం వచ్చే ఏడాదికి తెలుస్తుంది: E20 పై సుప్రీం కోర్టుకు కేంద్రం క్లారిటీ

ఇథనాల్ బ్లెండింగ్ ప్రయోగం మాత్రమే.. దీని ఫలితం వచ్చే ఏడాదికి తెలుస్తుంది: E20 పై సుప్రీం కోర్టుకు కేంద్రం క్లారిటీ

పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలిపే ప్రోగ్రామ్ ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉందని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. దీని ప్రభావం ఏంటనేది  వచ్చే ఏడాది నాటికి స్పష్టమవుతుందని మంగళవారం (జూన్ 30)  కోర్టుకు విన్నవించింది.   .

ఇథనాల్ బ్లెండింగ్ కారణంగా ఇంజిన్లు దెబ్బతినటంతో పాటు మైలేజీ విషయంలో చాలా తేడా వస్తుందని దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఈ తరుణంలో కేంద్రం వాదన చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ఇథనాల్ బ్లెండింగ్ తప్పనిసరి అని చెబుతూ.. విదాన పరమైన నిర్ణయం అని చెబుతూనే.. మరోవైపు ప్రయోగం మాత్రమేనని కేంద్రం సుప్రీం కోర్టుకు చెప్పడం వినియోగదారుల్లో చర్చకు దారితీస్తోంది.

మరోవైపు, E20 పెట్రోల్‌కు ఇంజిన్ సామర్థ్యం దెబ్బతినటానికి  గట్టి ఆధారాలు లేవని పేర్కొంది. ఈ విధానం ఇంధన భద్రతకు, రైతులకు, పర్యావరణానికి  ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపింది.

2025-26 సప్లై ఇయర్ కు  ఇథనాల్ కేటాయింపులకు సంబంధించి కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) సుప్రీం కోర్టులో సవాలు చేసింది. ఈ పిటిషన్ ను సుప్రీం కోర్టు విచారిస్తున్న సందర్భంగా కేంద్రం ఈ వాదన చేసింది. 

జూన్ 23 నాటి తన ఉత్తర్వులో, టెండర్ ప్రక్రియను ఖరారు చేయడానికి ముందే, తమ ఇథనాల్ కేటాయింపును పెంచాలని కోరుతూ ఒక డిస్టిలరీ చేసిన అభ్యర్థనను పరిశీలించాలని హైకోర్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలను  (OMCలు) ఆదేశించింది.  దీనిపై పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ సాధించాలన్న ప్రభుత్వ లక్ష్యంపై హైకోర్టు ఉత్తర్వు ప్రభావం చూపవచ్చని బీపీసీఎల్ సుప్రీంకోర్టుకు తెలిపింది.

ఇథనాల్ సరఫరా ఒప్పందాలు అక్టోబర్ 2025లోనే ఖరారయ్యాయి. ఇలాంటి పిటిషన్లు పలు హైకోర్టులలో పెండింగ్‌లో ఉన్నాయి. ఇది జాతీయ విధానంపై ప్రభావం చూపుతుంది అని  కేంద్రం తరఫున హాజరైన అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి, 

ప్రభుత్వం 20 శాతం ఇథనాల్ మిశ్రమంతో ప్రయోగాలు చేయడానికి ప్రయత్నిస్తోంది. వచ్చే ఏడాది నాటికి దాని ఫలితాలు మనకు తెలుస్తాయని ఆయన అన్నారు. 

ఒక సప్లైయర్ కు  కేటాయింపులో మార్పులు చేయడం వల్ల ఇతరుల నుండి కూడా అలాంటి పిటిషన్లు వచ్చే అవకాశం ఉందని, ఇది అనేక వ్యాజ్యాలకు దారితీసి, సప్లై చైన్ ను ప్రభావితం చేస్తుందని వెంకటరమణి వాదించారు.

ALSO READ : ‘‘ఆ పూణే అబ్బాయికి జుట్టు లేదు. ఇలాంటి అబద్ధాలు చెబితే చచ్చిపోతారు’’..

ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేస్తున్న బీపీసీఎల్, టెండర్ ప్రక్రియ తర్వాత సుమారు 1,759 కోట్ల లీటర్ల సప్లై ఆఫర్లను అందుకుందని ఆయన అన్నారు.

20 శాతం ఇథనాల్ మిశ్రమం అనేది ఒక విధాన నిర్ణయం, అది మారే అవకాశం లేదు అని అటార్నీ జనరల్ విచారణ అనంతరం మీడియాకు స్పష్టం చేశారు. డిమాండ్, ఇతర అంశాలను బట్టి కంపెనీలకు అందుబాటులో ఉండే ఇథనాల్ పరిమాణం పెరగొచ్చు లేదా తగ్గొచ్చు అని చెప్పారు. 

ఇండియా  పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపాలన్న తన లక్ష్యాన్ని గడువు కంటే ఐదేళ్ల ముందే సాధించినట్లు చెప్పారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ను సరఫరా చేయడం ప్రారంభించాయి . దీంతో 2030 నాటికి పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని 30 శాతానికి పెంచాలని ప్రభుత్వం ఇప్పుడు టార్గెట్ గా పెట్టుకుంది.