ప్రభుత్వ భూములను గుర్తించి రిపోర్ట్ ఇవ్వండి : కలెక్టర్ సంతోష్

ప్రభుత్వ భూములను గుర్తించి రిపోర్ట్  ఇవ్వండి : కలెక్టర్ సంతోష్

గద్వాల, వెలుగు :  జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి రిపోర్ట్  ఇవ్వాలని కలెక్టర్ సంతోష్  తహసీల్దార్లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్  మీటింగ్  హాల్ లో భూ సేకరణ, ఓటర్ జాబితా, భారత్ మాల తదితర అంశాలపై మీటింగ్  నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్  దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.

ధరణి, రెవెన్యూ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఓటర్ జాబితా 6, 7, 8కి సంబంధించి పెండింగ్  అప్లికేషన్లను పరిష్కరించాలని, బీఎల్​వోలు ఫీల్డ్  వెరిఫికేషన్  చేసేలా చూడాలన్నారు. అడిషనల్ కలెక్టర్లు అపూర్వ్ చౌహాన్, శ్రీనివాసులు ఉన్నారు.

గంజాయి సాగు చేస్తే క్రిమినల్  కేసులు

జిల్లాలో ఎక్కడైనా గంజాయి మొక్కలు దొరికినా, సాగు చేసినా క్రిమినల్  కేసులు తప్పవని కలెక్టర్ సంతోష్, ఎస్పీ రితిరాజ్  హెచ్చరించారు. మత్తు పదార్థాలపై ఎస్పీతో కలిసి కలెక్టర్  రివ్యూ మీటింగ్  నిర్వహించారు. జిల్లాలో గంజాయి సాగుపై ఎక్సైజ్, అగ్రికల్చర్ ఆఫీసర్లకు సమాచారం ఇవ్వాలన్నారు.

గంజాయి, డ్రగ్స్, హెరాయిన్  వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ప్రజలు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. అడిషనల్  ఎస్పీ రవి, డీఏవో గోవింద్ నాయక్, ఇన్​చార్జి డీఈవో ఇందిర ఉన్నారు.