ఎన్నికల్లో రిటర్నింగ్ ఆఫీసర్ల పాత్ర కీలకం : కలెక్టర్ సంతోష్

ఎన్నికల్లో రిటర్నింగ్ ఆఫీసర్ల పాత్ర కీలకం : కలెక్టర్ సంతోష్
  •     కలెక్టర్ సంతోష్

గద్వాల, వెలుగు : మున్సిపల్ ఎన్నికల్లో రిటర్నింగ్ ఆఫీసరుల పాత్ర కీలకమని కలెక్టర్ సంతోష్ అన్నారు. శనివారం కలెక్టరేట్ లో ఆర్వోలు, ఏఆర్వోలకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలను ఎలాంటి పొరపాట్లు లేకుండా పక్కాగా నిర్వహించాల్సిన బాధ్యత రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లదేనన్నారు. 

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో డ్యూటీ నిర్వహించిన అనుభవం ఉన్నప్పటికీ మున్సిపల్ ఎన్నికల్లోనూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు, జడ్పీ డిప్యూటీ సీఈవో నాగేంద్రం, ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి రమేశ్ బాబు పాల్గొన్నారు.