
కొల్లాపూర్, వెలుగు: పెంట్లవెల్లి మండలంలోని జటప్రోలు గ్రామంలో శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో కలెక్టర్ సంతోష్ బుధవారం జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. సీఎం పర్యటనను విజయవంతం చేయడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రతీ విభాగానికి ఒక ప్రత్యేక అధికారి నియమించామని, వారు తమ పరిధిలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. సభాస్థలిని పరిశీలించి, భద్రత, పోలీస్ బందోబస్తుపై పలు సూచనలు చేశారు.
సభకు వచ్చే ప్రజల కోసం వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచాలని, తాగునీరు, మొబైల్ టాయిలెట్ల సౌకర్యం కల్పించాలని చెప్పారు. అడిషనల్ కలెక్టర్ దేవ సహాయం, ఆర్డీవో బన్సీలాల్ పాల్గొన్నారు.