పండుగ పూట తప్పని గ్యాస్ కష్టాలు

పండుగ పూట తప్పని గ్యాస్ కష్టాలు

గద్వాల, వెలుగు: ఉగాది పండుగ పూట కూడా గ్యాస్ కష్టాలు తప్పడం లేదు. గ్యాస్ సిలిండర్ల కోసం గురువారం గద్వాల జిల్లా మానవపాడు ఇండేన్ గ్యాస్ గోదాం దగ్గర ప్రజలు గ్యాస్ గోదాంల క్యూ కట్టారు. ఒకవైపు కొరత లేదని చెప్తూనే బుక్ చేసుకున్న ఓటీపీ రావడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇండెన్, భారత్ గ్యాస్ కోసం బుక్ చేసుకున్న కంపెనీలు విధించిన టైం దాటిపోయిన ఓటీపీలు రోజుల తరబడి రావడంలేదని ఆరోపిస్తున్నారు.

పారదర్శకంగా సిలిండర్ల సరఫరా

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల పంపిణీ పారదర్శకంగా నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.  జిల్లాలో వినియోగదారులకు సరిపడా సిలిండర్లు ఉన్నాయని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇండేన్ గ్యాస్ కోసం 7718955555, హెచ్ పీ గ్యాస్ కోసం 9222201122, భారత్ గ్యాస్ కోసం 7715012345 ఫోన్ నెంబర్లు కాల్ చేసి బుక్ చేసుకోవాలని సూచించారు. ఏవైనా ఫిర్యాదులు చేయాల్సి ఉంటే ఎన్​ఫోర్స్​మెంట్​ డీటీ 9010310309 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.