రైతులకు ఇబ్బంది కలగకుండా వడ్ల కొనుగోళ్లు చేపట్టాలి : కలెక్టర్ సత్యప్రసాద్

రైతులకు ఇబ్బంది కలగకుండా వడ్ల కొనుగోళ్లు చేపట్టాలి : కలెక్టర్ సత్యప్రసాద్

జగిత్యాల టౌన్, వెలుగు: రైతులకు ఇబ్బంది కలగకుండా వడ్ల కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరెట్ లో వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వడ్ల కొనుగోళ్లపై గన్నీ గోదాం ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జులు, రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు సీజన్లలో రికార్డు స్థాయిలో వడ్ల కొనుగోలు జరిగాయని, ఈసారి కూడా పక్కా ప్రణాళికతో కొనుగోలు ప్రక్రియ పూర్తిచేయలాన్నారు. 

వానాకాలం 2025–26కి సంబంధించి జిల్లాలో 3.15 లక్షల ఎకరాల్లో వరి సాగయిందని, 7.50 నుంచి 8 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడికి అంచనా ఉందని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలన్నారు. 421 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కొనుగోలు సెంటర్లలో మౌలిక వసతులను కల్పించాలని నిర్వాహకులను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లత, డీఆర్డీవో రఘువరన్, డీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో జితేందర్ రెడ్డి, సివిల్ సప్లై డీఎంవో జితేంద్ర ప్రసాద్, మార్కెటింగ్ అధికారి ప్రకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.