
జగిత్యాల టౌన్, వెలుగు: భూ భారతి చట్టంపై జీపీవోలు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. బుధవారం జగిత్యాల కలెక్టరేట్‌లో కొత్తగా ఎంపికైన జీపీవోలకు విధులు, బాధ్యతలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీపీవోలు గ్రామ పటం, నీరు, ఇసుక, మైనింగ్ కార్యకలాపాలపై నియంత్రణతోపాటు, కులం, నివాసం,ఆదాయం, లోకల్ ఏరియా, ఇతర ధ్రువీకరణ పత్రాల మంజూరు కోసం విచారణ నివేదికలో క్రియాశీలంగా వ్యవహరించాలన్నారు.
శిఖం భూములు, ప్రభుత్వ భూముల ఆక్రమణ జరగకుండా నెలలో కనీసం రెండుసార్లు సందర్శించాలని తెలిపారు. గ్రామాల్లోని ఇసుక, మట్టి అక్రమ రవాణా అరికట్టాల్సిన బాధ్యత వారిపైనే ఉందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు లత, రాజా గౌడ్, ఏవో, అధికారులు, జీపీవోలు పాల్గొన్నారు.
మున్సిపల్ జవాన్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు
జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికురాలు.. జవాన్‌గా గా పని చేస్తున్న చిట్యాల రాజ్‌కుమార్‌పై బుధవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. జవాన్ తనను లైంగికంగా వేధించడంతోపాటు నెలకు రూ.వెయ్యి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది.