గ్రూప్ 4 పరీక్షకు గంట ముందే సెంటర్‌‌కు రావాలి : కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి

గ్రూప్ 4 పరీక్షకు గంట ముందే సెంటర్‌‌కు రావాలి : కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి

కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు :  రేపు జరగనున్న గ్రూప్ –-4 పరీక్షకు అభ్యర్థులు గంట ముందుగానే సెంటర్లకు చేరుకోవాలని కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి గురువారం ఒక ప్రకటనలో కోరారు. జులై -1న ఉదయం 10 గంటల నుంచి 12-.30 వరకు, మధ్యాహ్నం 2-.30 నుంచి 5 గంటల వరకు రెండు సెషన్లలో ఎగ్జామ్ జరగనుందని చెప్పారు. పరీక్ష  ప్రారంభానికి 15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్ చేస్తామని, త్వరాత వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఫోన్లు, వాచీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, రిమోట్‌‌తో కూడిన కారు తాళాలు తీసుకురావద్దని, షూస్ ధరించవద్దని చెప్పారు.  జిల్లాలో 53, 213 మంది అభ్యర్థులు ఉండగా.. 188  సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు.

ఇన్విజిలేటర్లు సర్వీస్ కమిషన్ నిబంధనలు పాటించాలని, ఎగ్జామ్ ముగిసిన అభ్యర్థుల నుంచి ఓఎంఆర్ షీట్‌‌తో పాటు నామినల్ రోల్‌‌పై వేలిముద్రలు తీసుకోవాలని సూచించారు. అభ్యర్థి  కాకుండా  వేరే వ్యక్తులు ఎగ్జామ్‌‌ రాస్తే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.

  పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు  

గ్రూప్​–4 --పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఎస్పీ అపూర్వరావు తెలిపారు.  జిల్లాలో మూడు సబ్ డివిజన్ పరిధిలో 188 సెంటర్లు ఏర్పాటు చేయగా..  ఒక అడిషనల్ ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, 15 మంది సీఐలు , 42 మంది ఎస్సైలు, 427 మంది కానిస్టేబులల్స్‌‌తో  బందోబస్తు నిర్వహించనున్నామని తెలిపారు.  పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్స్,ఇంటర్ నెట్ సెంటర్స్  మూసి వేయాలని ఆదేశించారు.