
నిజామాబాద్, వెలుగు : జిల్లాలోని రేషన్ షాపులు, మీ సేవా సెంటర్లను రెగ్యులర్‌గా విజిట్ చేసి లోపాలుంటే సరి చేయాలని కలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డి తహసీల్దార్లకు సూచించారు. గురువారం తన ఆఫీస్ నుంచి నిర్వహించిన వీడియోకాన్ఫ్రెన్స్లో మాట్లాడారు. రేషన్ షాపు డీలర్లు సమయ పాలనతో పాటు రూల్స్ పాటిస్తున్నారా? లేదా? గమనించాలన్నారు. కొందరు మీ-సేవా సెంటర్ నిర్వాహకులు దరఖాస్తుదారుల నుంచి అధిక ఫీజు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నందున గ్రౌండ్ రియాల్టీ తెలుసుకోవాలన్నారు.
భూభారతి అప్లికేషన్ల పరిష్కారానికి ఆగస్టు 14ను కటాఫ్‌గా పరిగణించాలని, అదనపు కలెక్టర్, ఆర్డీవోలు రెగ్యులర్ పర్యవేక్షణ చేయాలన్నారు. కొత్త రేషన్ కార్డులు, కొత్తగా పేర్ల యాడింగ్కు దరఖాస్తులు తీసుకోవాలని, అర్హులు మాత్రమే లబ్ధి పొందేలా వెరిఫికేషన్ చేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఫ్రీగా ఇసుక ఇవ్వాలన్నారు. అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్, డీఎస్వో అరవింద్‌రెడ్డి, హౌసింగ్ ఆఫీసర్ నివర్తి తదితరులు ఉన్నారు.