ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి : కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

 ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి : కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట,   వెలుగు: గ్రామపంచాయతీ ఎన్నికలలో రిటర్నింగ్ ఆఫీసర్లు పారదర్శకంగా బాధ్యతగా ఎన్నికల విధులు నిర్వహించాలని కలెక్టర్ తేజస్   నంద్ లాల్ పవార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో  ఏర్పాటు చేసిన రెండో విడత రిటర్నింగ్ అధికారుల ట్రైనింగ్ ప్రోగ్రాంలో  పాల్గొని రిటర్నింగ్ ఆఫీసర్లకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..  ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు రిటర్నింగ్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పూర్తి బాధ్యత ఉంటుందని తెలిపారు. అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, డీపీఓ యాదగిరి, డీఆర్డీఏ పీడీ వీవీ అప్పారావు, డీఎఫ్ఓ సతీశ్, ట్రైనర్లు రమేష్, వెంకటేశ్వర్లు,రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

నామినేషన్ కేంద్రాల పరిశీలన 

మునగాల, వెలుగు: మోతే గ్రామ పంచాయతీ, రాఘవపురం, చివ్వెంల మండలం బండమీది చందుపట్ల జీపీ ఆఫీసుల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను కలెక్టర్ పర్యవేక్షించి ఆర్ ఓ లకు పలు సూచనలు చేశారు. మంగళవారం రెండో విడత నామినేషన్ కు చివరి రోజు అన్నారు.  సాయంత్రం 5 లోపు నామినేషన్ కేంద్రంలో ఉన్న వారికి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు టోకెన్స్ ఇచ్చి నామినేషన్లు స్వీకరిస్తారన్నారు.  పోటీ చేసే అభ్యర్థులు కొత్త బ్యాంకు అకౌంట్ కలిగి ఉండాలని, ఒకవేళ కొత్త బ్యాంకు అకౌంట్ లేకపోయినా నామినేషన్ వేసి స్క్రూటినీ లోపు బ్యాంకు అకౌంట్ వివరాలు సమర్పించాలని సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ల్ వెంకన్న, చంద్రశేఖర్, ఎంపీడీఓలు ఆంజనేయులు, సంతోష్ కుమార్, ఆర్ ఓ లు తదితరులు ఉన్నారు.---