మేళ్లచెరువు, వెలుగు: మేళ్లచెరువు, చింతలపాలెం మండలాల్లోని నామినేషన్ కేంద్రాలను శుక్రవారం కలెక్టర్ తేజస్ నందూలాల్ పవార్, జిల్లా ఎన్నికల పరిశీలకులు రవి నాయక్ వేర్వేరుగా పరిశీలించారు. చింతలపాలెం, దొండపాడు, మేళ్లచెరువు, రామాపురం క్లస్టర్లలోని అధికారులతో కలెక్టర్ మాట్లాడి, నామినేషన్ల సంఖ్యను తెలుసుకున్నారు.
అభ్యర్థులకు సందేహాలు ఉంటే హెల్ప్ డెస్క్ ను సంప్రదించాలని సూచించారు. మేళ్లచెరువులో క్యూలైన్ లో ఉన్న 55 మంది అభ్యర్థులకు టోకెన్లను అందజేసి, ప్రత్యేక కౌంటర్ లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆయనవెంట తహసీల్దార్లు రాజేందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, ఎంపీడీవోలు అస్గర్ అలీ, రామచందర్ రావు, ఎంపీవో భూపాల్ రెడ్డి, ఎస్సై పరమేశ్ ఉన్నారు.
