సీఎంఆర్​ను త్వరగా పూర్తి చేయాలి : వల్లూరి క్రాంతి

 సీఎంఆర్​ను త్వరగా పూర్తి చేయాలి : వల్లూరి క్రాంతి

పటాన్​చెరు,(గుమ్మడిదల),వెలుగు: సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలంలో గురువారం కలెక్టర్​ వల్లూరి క్రాంతి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మండల పరిధిలోని విజయ లక్ష్మి పారాబాయిల్డ్​ రైస్​ మిల్లును తనిఖీ చేశారు.  ధాన్యాన్ని ఏ విధంగా స్టోర్​చేశారు,  కూలీల కొరత ఉందా, తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 2023,--24  ఖరీఫ్​లో  విజయ లక్ష్మి పారా బాయిల్డ్  రైస్ మిల్  కు అప్పగించిన రూ.1, 76,750   టన్నుల ధాన్యానికి  రూ. 1,18, 600  టన్నులు బియ్యం అందించాల్సి ఉంది కానీ  ఇప్పటివరకు రూ.13,700, 46  టన్నుల  బియ్యం మాత్రమే అందించారన్నారు. 

మిగిలిన బియ్యాన్ని త్వరగా  అందించాలని  సూచించారు. అనంతరం పటాన్​చెరు మండలం, పాటి జీపీని, ముత్తంగి పీహెచ్​సీని తనిఖీ చేశారు. వేసవిలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. డ్రింకింగ్ వాటర్  కంట్రోల్ రూమ్ ఫోన్​ నెంబర్  08455-276155 అందరికి తెలిసేలా ప్రదర్శించాలని సూచించారు. గ్రామంలో  వడదెబ్బపై  విస్తృత ప్రచారం చేయాలని  ఎవరైనా వడదెబ్బకి గురైతే  వెంటనే వారిని గవర్నమెంట్​హాస్పిటల్​కు తరలించాలన్నారు.  ఉపాధి హామీ  కూలీలు 12 గంటల్లోపు  పనులు పూర్తి చేసుకోవాలన్నారు. కలెక్టర్ తో పాటు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వనజ, పౌర సరఫరాల శాఖ సిబ్బంది, ఆర్​డబ్ల్యూఎస్​ శ్రీనివాస్, ఏఈవో  శ్రీనివాస్, ఎంపీడీవో యాదగిరి పాల్గొన్నారు.

శిక్షణ కేంద్రాల పరిశీలన

పటాన్​చెరు గవర్నమెంట్​డిగ్నీ కాలేజ్​, ప్రభుత్వ జూనియర్ కాలేజ్​లో జరుగుతున్న ప్రిసైడింగ్ అధికారుల శిక్షణను కలెక్టర్​ పరిశీలించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్​ద్వారా ఈవీఎంల పనితీరు, పోలింగ్ కేంద్రంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. ఏవైనా సమస్యలు, సందేహాలు, సలహాలు, సూచనల కోసం మాస్టర్ ట్రైనర్స్ ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్​కలెక్టర్ మాధురి, తహసీల్దార్లు భిక్షపతి, రాధా, సంగ్రామ్​రెడ్డి, రంగారావు, మాస్టర్ ట్రైనర్స్, ఎన్నికల విభాగం సిబ్బంది, ప్రిసైడింగ్​అధికారులు పాల్గొన్నారు.
 
101 మందికి నోటీసులు 

సంగారెడ్డి టౌన్: శిక్షణ కార్యక్రమానికి గైర్హాజరైన 101 మంది అధికారులపై జిల్లా ఎన్నికల అధికారివల్లూరు క్రాంతి చర్యలు తీసుకున్నారు. ఈ నెల 1, 2న తేదీల్లో 4180  మంది ప్రిసైడింగ్‌ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌అధికారులకు జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో శిక్షణా తరగతులను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా సోమ, మంగళ వారాల్లో నిర్వహించిన తరగతులకు  గైర్హాజరైన వారికి నోటీసులు పంపించారు.