పాఠం చెప్పిన కలెక్టర్..  పలు స్కూళ్లలో తనిఖీ

పాఠం చెప్పిన కలెక్టర్..  పలు స్కూళ్లలో తనిఖీ

నిర్మల్, వెలుగు: నిర్మల్​జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి గురువారం పలు స్కూళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సోన్ మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ స్కూల్, జూనియర్ కాలేజీని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కొద్దిసేపు లెక్కలు బోధించారు. కొన్ని చిట్కాలు కూడా నేర్పారు. ఆ తర్వాత స్కూల్లోని కిచెన్​ను తనిఖీ చేశారు. అందించే భోజనం గురించి స్టూడెంట్లను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. 

అంగన్వాడీ కేంద్రంలో..

లక్ష్మణచాంద (మామడ): లక్ష్మణచాంద మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. చిన్నారుల హాజరు శాతం, గర్భిణులకు అందించే పోషకాహారాల రికార్డులను పరిశీలించారు. మెనూ ప్రకారం పిల్లలకు భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం మండలంలోని చందారం గ్రామంలో కోండ్ర శివారెడ్డి సాగు చేస్తున్న కూరగాయల పంట పరిశీలించి ఆయనను అభినందించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్, ఏడీఏ వినయ్ బాబు, ఎంపీడీవో రమేశ్, ఏఈఓలు ఉన్నారు.