రంజాన్ ను మతసామరస్యంగా జరుపుకోవాలి : కలెక్టర్ విజయేందిర బోయి

రంజాన్ ను మతసామరస్యంగా జరుపుకోవాలి : కలెక్టర్ విజయేందిర బోయి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు :  వచ్చే నెలలో ప్రారంభమయ్యే రంజాన్ మాసాన్ని శాంతియుతంగా, మతసామరస్యంతో జరుపుకోవాలని కలెక్టర్ విజయేందిర బోయి ముస్లింలకు సూచించారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని శనివారం  రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ తో కలిసి శనివారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో  ముస్లిం మత పెద్దలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. రంజాన్ మాసం ప్రారంభంకానున్న నేపథ్యంలో ముందస్తుగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై పలు సలహాలు, సూచనలు చేశారు. 

పీఎంశ్రీ నిధులను వినియోగించాలి

పీఎంశ్రీ స్కీం కింద మంజూరైన నిధులు సంపూర్ణంగా వినియోగించుకోవాలని కలెక్టర్ విజయేందిర బోయి విద్యాశాఖ అధికారులు, హెచ్ఎంలను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  పీఎంశ్రీ పథకం పరిధిలో ఉన్న స్కూల్స్, కేజీబీవీల ప్రత్యేకాధికారులతో రివ్యూ నిర్వహించారు.