సువెన్ ఫార్మా కంపెనీ సీజ్ చేయాలి..ప్రజాపంథా నాయకుల ధర్నా

సువెన్ ఫార్మా కంపెనీ సీజ్ చేయాలి..ప్రజాపంథా నాయకుల ధర్నా

సూర్యాపేట వెలుగు:  సువెన్ ఫార్మా కంపెనీని  సీజ్ చేయాలని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. ఏఓ శ్రీదేవికి 
వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ సువెన్ ఫార్మా గిరిజనుల వద్ద నుంచి తక్కువ ధరకు 100 ఎకరాలు సేకరించి ఆ కంపెనీని రూ. 650కోట్లకు విదేశీ కంపెనీకి అమ్ముకొని మోసం చేసిందని ఆరోపించారు. 2018 నుంచి మరో కొత్త ప్లాంట్ ఓపెన్ చేయాలని చూస్తోందని,

ఇది పొరపాటున బ్లాస్ట్ అయితే చుట్టూ 10 కిలో మీటర్లు శ్మశానం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.  ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా సువెన్ ఫార్మా కంపెనీని వెంటనే సీజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో  పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్​యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.