సార్.. వానొస్తే రూమ్స్ కురుస్తున్నయ్ : కలెక్టర్తో స్టూడెంట్స్

సార్.. వానొస్తే రూమ్స్ కురుస్తున్నయ్ : కలెక్టర్తో స్టూడెంట్స్

 యాదాద్రి, వెలుగు : సార్.. వానపడితే రూములు కురుస్తున్నాయి' అని కలెక్టర్ హనుమంతరావుతో హాస్టల్​ స్టూడెంట్స్ విన్నవించారు. జిల్లాలోని మోటకొండూరులోని బీసీ బాలికల గురుకులాన్ని సోమవారం రాత్రి కలెక్టర్​ఆకస్మికంగా సందర్శించారు. స్టూడెంట్స్​ను కలిసి మాట్లాడారు. రూమ్స్​ కురుస్తుండడం వల్ల ఇబ్బంది పడుతున్నామని స్టూడెంట్స్​వాపోయారు. హాస్టల్​కు వచ్చే రోడ్డు కూడా సరిగా లేదని తెలిపారు. దీంతో వెంటనే రిపేర్​ చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. 

లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే చర్యలు..

లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని  కలెక్టర్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్​లో పీసీపీ ఎన్డీటీ చట్టం అమలుపై నిర్వహించిన రివ్యూ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. స్కానింగ్ సెంటర్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. రూల్స్ అతిక్రమిస్తే స్కానింగ్ సెంటర్ల రిజిస్ట్రేషన్ రద్దు చేయడంతోపాటు సిఫారసు చేసిన డాక్టర్, స్టాఫ్​ జైలు శిక్షతోపాటు జరిమానా విధించాల్సి ఉంటుందని హెచ్చరించారు.