
సూర్యాపేట, వెలుగు : జూలై 14 నుంచి చేపట్టే విద్యుత్ ఆర్టిజన్ల సమ్మెను విజయవంతం చేయాలని టీవీఏసీ జేఏసీ చైర్మన్ మేడె మారయ్య కార్మికులకు పిలుపునిచ్చారు. మంగళవారం టీజీఎస్పీడీసీఎల్ సూర్యాపేట సర్కిల్ ఆఫీసులో జిల్లా ఆర్టిజన్ కార్మికులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనియన్లతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క ఆర్టిజన్ కార్మికుడు జూలై 14 నుంచి సమ్మెలో పాల్గొనాలని కోరారు.
అలాగే ఒకే సంస్థలో రెండు రూల్స్ తీసుకురావడం అన్యాయమన్నారు. స్టాండింగ్ ఆర్డర్స్ ను రద్దుచేసి ఏపీఎస్ ఈబీ రూల్స్ వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకపోతే నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో విద్యుత్ ఆర్టిజన్ జేఏసీ నాయకులు రెహమాన్, దయాకర్ రెడ్డి, మురహరి, రామస్వామి, రాఘవ గోపికృష్ణ, నాగయ్య, యాకయ్య పాల్గొన్నారు.