వరంగల్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు, తరలింపులు స్పీడప్ చేయాలి : కలెక్టర్లు

వరంగల్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు, తరలింపులు స్పీడప్ చేయాలి : కలెక్టర్లు

మహబూబాబాద్/ జనగామ అర్బన్, వెలుగు: ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పనిచేయాలని కలెక్టర్లు ఆఫీసర్లను ఆదేశించారు. గురువారం మహబూబాబాద్​ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరు, లాస్య తండా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ స్నేహ శబరీశ్, ఎస్పీ శబరీశ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం నిల్వలు, తేమ శాతం పరీక్షలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ధాన్యం తరలింపు ఏర్పాట్లను పరిశీలించి, ఆఫీసర్లకు పలు సూచనలు చేశారు. 

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురం ఎర్రగట్టు తండా, మేకలగట్టు, నర్మెట్ట మండలం నర్మెట్ట, వెల్దండ, జనగామ మండలం వెంకిర్యాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్​ సందీప్​ కుమార్​ ఝా పరిశీలించారు. కొనుగోలు చేసిన ధాన్యం రవాణా ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిపై రివ్యూ నిర్వహించారు. జిల్లాకు మంజూరైన ఇండ్ల నిర్మాణాలు ప్రారంభం కాని వివరాలు, మార్క్​ చేయని వాటి రిపోర్ట్​ను ఇవ్వాలన్నారు.