
ఏడాది జీతం.. అక్షరాల కోటి ఇరవై లక్షల రూపాయలు. గూగుల్ ఏరికోరి మరి ఆ కుర్రాడికి పెద్ద పోస్టు ఇచ్చింది. ఆఏముంది ఏ ఐఐటీలోనో, ఎన్ఐటీలోనో చదివి ఉంటాడు.. జాక్‌పాట్ కొట్టాడు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే అతడు చదివింది ఓ మామూలు కాలేజీలో. చిన్నకాలేజీలో చదివినోళ్లకు మహా అయితే నాలుగు లేదా ఐదు లక్షల జీతమిచ్చి తీసుకుంటారు. కానీ, పుణేకి చెందిన 21 ఏళ్ల అబ్దుల్లా ఖాన్ కథ మాత్రం వేరు. పుణే మీరా రోడ్‌లోని శ్రీ ఎల్ఆర్ తివారీ ఇంజనీరిం గ్ కాలేజీలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఓ సైట్లో తన ప్రొఫైల్‌ను పెట్టాడు. ఆ ప్రొఫైల్‌ను చూసిన గూగుల్ ఆన్లైన్లో చాలా సార్లు ఇంటర్వ్యూ చేసి ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూకు పిలిచిం ది. ఈనెల మొదట్లో లండన్‌లోని గూగుల్ ఆఫీస్‌కు అబ్దుల్లా ఇంటర్వ్యూకు వెళ్లాడు. అక్కడ గూగుల్ మనసును అబ్దుల్లా దోచేశాడు. దీంతో ఏడాదికి ₹1.2 కోట్ల జీతం ఇచ్చేందుకు గూగుల్ ఒప్పుకుంది. నాలుగేళ్ల బాండ్ తీసుకుంది. జీతంలో మూల వేతనం (బేసిక్) ₹54.5 లక్షలు (60 వేల పౌండ్లు ).15 శాతం బోనస్, స్టాక్‌లు కలిపి మరో ₹58.9 లక్షలు ఇచ్చేందుకు ఓకే చెప్పింది. ఈ ఏడాది సెప్టెంబర్ లో గూగుల్ టీం లో అతడు చేరనున్నాడు. ఇంత పెద్ద ఆఫర్ తనను వరిస్తుందని కలలో కూడా ఊహించలేదని అబ్దుల్లా చెప్పాడు. ఇక, ఇంటర్ వరకు అతడు సౌదీ అరేబియాలోనే చదువుకున్నాడు.