ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

మందమర్రి,వెలుగు: సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారించడంలో టీబీజీకేఎస్, ఏఐటీయూసీలు విఫలమయ్యాయని, ఆ సంఘాల లీడర్లు పైరవీలతో పబ్బం గడుపుకుంటున్నారని  ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్​ బి.జనక్​ప్రసాద్ ఆరోపించారు. శనివారం మందమర్రి ఏరియా కేకే-5 గనిపై నిర్వహించిన గేట్​ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. సింగరేణిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణను ప్రోత్సాహిస్తున్నాయని మండిపడ్డారు. మందమర్రి ఏరియాలో రెండు బొగ్గు గనులు మూతపడుతున్నాయని ఏరియా  భవిష్యత్తుపై యాజమాన్యం, గెలిచిన సంఘాలకు కార్యాచరణ ఏదీ లేదన్నారు. ఐఎన్టీయూసీ నేషనల్​ ప్రెసిడెంట్ జి.సంజీవరెడ్డి బీజేపీలో చేరకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఐఎన్టీయూసీ యూనియన్​ను వేజ్​బోర్డులో లేకుండా చేసిందని ఆరోపించారు.  

ఆదివారం మందమర్రిలోని ఐఎన్టీయూసీ ఆఫీస్​లో నిర్వహించే యూనియన్​జనరల్​బాడీ సమావేశానికి కార్మికవర్గం పెద్ద సంఖ్యలో హాజరుకావాలన్నారు. సమావేశంలో ఐఎన్టీయూసీ ఏరియా వైస్  ప్రెసిడెంట్​దేవి భూమయ్య, కేంద్ర కమిటీ చీఫ్​ఆర్గనైజింగ్​సెక్రటరీ రాంశెట్టి నరేందర్, ఏరియా సెక్రటరీలు దొరిశెట్టి చంద్రశేఖర్, బత్తుల వేణు, లీడర్లు రమణారావు, విక్రమొద్దీన్, యాదగిరి, పిట్ సెక్రటరీ భీమారపు సదయ్య, స్వామి, హరీశ్, కృష్ణ మోహన్, రమేశ్, కళ్యాన్, గంగయ్య, మధూకర్, మల్లేశ్​ తదితరులు పాల్గొన్నారు.

ట్రెక్ ​సైక్లింగ్​ మళ్లీ ప్రారంభిస్తాం

జన్నారం,వెలుగు: పర్యాటకుల కోసం జన్నారం ఫారెస్ట్​డివిజన్ లో త్వరలో సైకిల్ ట్రెక్​ సైక్లింగ్​​మళ్లీ ప్రారంభిస్తామని మంచిర్యాల డీఎఫ్ వో  శివ్ అశిస్ సింగ్ తెలిపారు. శనివారం ఆయన జన్నారం ఫారెస్ట్​డివిజన్​లో జన్నారం, తాళ్లపేట రేంజ్ ఆఫీసర్లు హఫీజొద్దిన్, రత్నాకర్ రావుతో కలిసి సైకిల్ పై సుమారు 5 గంటల పాటు 50 కిలో మీటర్లు తిరిగారు. సైకిల్ ట్రెక్కింగ్ ​ద్వారా పర్యాటకులు అడవిలోని నీటి కుంటలు, గడ్డిమైదానాలు, పక్షులు తదితరాలు చూడొచ్చన్నారు. 

సమస్యలు పరిష్కరించాలి

బెల్లంపల్లి రూరల్,వెలుగు: నెన్నెల మండలంలోని సమస్యలు పరిష్కరించడంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య విఫలమయ్యారని బీజేపీ నియోజకవర్గ ఇన్​చార్జి కొయ్యల ఏమాజీ ఆరోపించారు. నెన్నెల పార్టీ మండల కార్యవర్గ సమావేశం శనివారం ఆ పార్టీ మండల అధ్యక్షుడు శైలేందర్​సింగ్ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ఏమాజీ హాజరై మాట్లాడారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యంలో ఇష్టారాజ్యంగా కోతలు విధిస్తున్నారని మండిపడ్డారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన రిజిప్ట్​ఇవ్వడంలేదన్నారు. కోణంపేట, కొత్తూర్, నార్వాయిపేట , చిత్తాపూర్, గుండ్లసోమారం, ఖర్జీ గ్రామాలకు చెందిన పోడు భూముల సమస్యలు పరిష్కరించాలని, కుమ్మరివాగు ప్రాజెక్టు కాల్వ, నందులపల్లి ప్రాజెక్టు కాల్వలకు మరమ్మతు చేయాలన్నారు.

నెన్నెల–ఖర్జీ రోడ్డుకు రిపేర్​చేయాలని కోరారు. మన్నెగూడం– ఖర్జీ రోడ్డు అధ్వానంగా మారిందన్నారు. కోణంపేట గ్రామానికి మిషన్ భగీరథ నీటిని సరఫరా చేయాలని డిమాండ్​ చేశారు. స్థానిక సమస్యలపై బీజేపీ ఆధ్వర్యంలో పోరాటం చేయాలని తీర్మానించారు. కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు కేశవరెడ్డి, సాంబమూర్తిగౌడ్​, గట్టు రాజయ్య, గట్టు శివలింగ, మండల గిరిజన మోర్చా అధ్యక్షుడు దరావత్ విజయ్, బూత్​ అధ్యక్షులు సీతారాం, కొండు రాహుల్, కోట రాజలింగు  తదితరులు పాల్గొన్నారు.

ప్రైవేట్​ వ్యక్తులకు బొగ్గుబ్లాక్​లు ఇస్తే సింగరేణి మనుగడ ఎట్ల?

రామకృష్ణాపూర్,వెలుగు: కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని బొగ్గు బ్లాక్​లను వేలం ద్వారా ప్రైవేటోళ్లకు కట్టబెడితే సింగరేణి మనుగడ ఎలా అని ఏఐటీయూసీ జనరల్​సెక్రటరీ వాసిరెడ్డి సీతారామయ్య ప్రశ్నించారు. శనివారం మందమర్రి ఏరియా ఆర్కే1ఏ గనిపై ఏర్పాటు చేసిన గేట్​ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో బొగ్గు బ్లాక్​లు లేకపోతే సింగరేణి సంస్థ కనుమరుగవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని బొగ్గు బ్లాక్ లను వేలం నుంచి తొలగించాలని డిమాండ్​చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణను ప్రోత్సాహిస్తున్నాయని ఆరోపించారు.

గుర్తింపు సంఘం టీబీజీకేఎస్​ అసమర్థత కారణంగా కార్మిక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. వేజ్​బోర్డుపై అవగాహన లేని టీబీజీకేఎస్​ లీడర్లు జాతీయ కార్మికసంఘాలను విమర్శించడం మానుకోవాలని హితవుపలికారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ప్రెసిడెంట్ ఎండీ అక్బర్​అలీ, బ్రాంచి వైస్​ ప్రెసిడెంట్​ఇప్పకాయల లింగయ్య, పిట్ సెక్రటరీలు సురమల్ల వినయ్​కుమార్​, ఎం.ఆంజనేయులు, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ గోవిందుల రమేశ్, మెంబర్లు గాజుల రాయమల్లు, సుంకరి గట్టయ్య, మారం రాజు, కొత్తగిరి ప్రసాద్, లక్ష్మయ్య​, పాషా, సిద్ధం అరుణ్, శంకర్, శ్రీనివాస్, రమేశ్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

జిల్లా సమగ్ర స్వరూపం పుస్తకావిష్కరణ 

మంచిర్యాల,వెలుగు: తెలంగాణ సారస్వత పరిషత్​ ఆధ్వర్యంలో రూపొందించిన మంచిర్యాల జిల్లా సమగ్ర స్వరూపం పుస్తకాన్ని శనివారం సరస్వతి శిశుమందిర్​ హాల్​లో ఆవిష్కరించారు. 33 జిల్లాల తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాహిత్యం ఇతర అంశాలపై సమగ్ర సంపుటాలను 15వేల పేజీల్లో వెలువరించనున్నామని పరిషత్​ ప్రధాన కార్యదర్శి డాక్టర్​ జె.చెన్నయ్య తెలిపారు. తొమ్మిదవ సంపుటంగా మంచిర్యాల జిల్లా సమగ్ర స్వరూపం గ్రంథాన్ని వెలువరించామన్నారు. ఇప్పటివరకు జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్, రాజన్న సిరిసిల్ల, వనపర్తి, మహబూబ్​నగర్, నిజామాబాద్ జిల్లాల సంపుటాలను ఆవిష్కరించామని చెప్పారు.

మంచిర్యాల జిల్లా సంపుటి కోర్ కమిటీ కన్వీనర్ కవి, గోపగాని రవీందర్ మాట్లాడుతూ ఆరు నెలలుగా వ్యాసకర్తల సహకారంతో శ్రమించి 400 పేజీల సంపుటిని తీసుకొచ్చామన్నారు. వివిధ అంశాలపై వ్యాసాలు రచించిన 47 మంది రచయితలను సత్కరింపజేశారు. పలువురు కవులు, కవయిత్రులు మంచిర్యాల వైభవం అనే అంశంపై తమ కవితలు గానం చేశారు. కోర్ కమిటీ సభ్యులు, కవి, రచయితలు కొండు జనార్దన్, దండనాయకుల వామన్​రావు, ఎం.మలయశ్రీ, బోనగిరి రాజారెడ్డి, అల్లాడి శ్రీనివాస్, తోకల రాజేశం, ఎస్.నీలాదేవి, గుండేటి యోగేశ్వర్​ పాల్గొన్నారు.

జిల్లా బీజేపీ లీడర్లకు బండి సంజయ్​ ప్రశంసలు

నిర్మల్,వెలుగు: ప్రజా సంగ్రామయాత్రను సక్సెస్ చేసినందుకు నిర్మల్​జిల్లా బీజేపీ లీడర్లను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  ప్రశంసించారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో జరుగుతున్న బండి సంజయ్ పాదయాత్రకు హాజరయ్యారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి ఆధ్వర్యంలో జిల్లా యాత్ర ప్రముఖ్ గంగిడి మనోహర్ రెడ్డి, పాదయాత్ర ఇన్​చార్జి పెద్దోల గంగారెడ్డిలను  బండి సంజయ్ శాలువాలతో సన్మానించారు. పాదయాత్ర విజయవంతానికి సమష్టిగా  కృషి చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పార్టీ పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్న గారి భూమయ్య, పెద్దపల్లి జిల్లా ఇన్​చార్జి రావుల రామనాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు మెడిసెమ్మ రాజు, సామ రాజేశ్వర్​రెడ్డి, సీనియర్ లీడర్లు డాక్టర్​మల్లికార్జున్​రెడ్డి, అంజు కుమార్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ అప్పాల గణేశ్, నాయుడు మురళి తదితరులు ఉన్నారు.

‘ప్రభుత్వ భూములపై లీడర్లు కన్నేసిన్రు’

ఖానాపూర్,వెలుగు: అక్రమాలు బయటపకుండా ఉండేందుకు అధికార పార్టీ లీడర్లు చక్రం తిప్పుతున్నారని కాంగ్రెస్​పార్టీ ఫ్లోర్​లీడర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి రాజుర సత్యం ఆరోపించారు. శనివారం ఆయన ఖానాపూర్​లో మీడియాతో మాట్లాడారు. మున్సిపల్​ కమిషనర్​ను విధుల్లో చేరకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. పట్ణంలోని విలువైన ప్రదేశంలోని అంగన్​వాడీ భవనం పక్కన గల ప్రభుత్వ స్థలాన్ని  అమ్ముకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ లీడర్ల అక్రమాలను అడ్డుకునేందుకు కాంగ్రెస్​పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు దయానంద్, నిమ్మల రమేశ్, మాజీ వైస్ ఎంపీపీ తోట సత్యం తదితరులు ఉన్నారు.

బీజేపీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తాం

బజారత్నూర్, వెలుగు: బోథ్​ నియోజకవర్గంలో బీజేపీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తామని గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సాకటి దశరథ్ చెప్పారు. శనివారం బజార్​హత్నూర్​మండలం భూతాయి (కె), భూతాయి (బి) గ్రామాల్లో బూత్ కమిటీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని కోరారు. సమావేశానికి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు అంటే మాధవ్ రావు, పెరుగు సంతోష్, మండల ప్రధాన కార్యదర్శి, సర్పంచ్ ప్రకాశ్, సర్పంచ్ మారుతి, బజార్​హత్నూర్ సొసైటీ డైరెక్టర్ షేర్ సింగ్, ఈశ్వర్, గ్రామ పటేళ్లు, యూత్ మెంబర్లు  పాల్గొన్నారు.

సంకీర్తనకు ఆర్థిక సహాయం

కుభీర్,వెలుగు: మండలంలోని సిర్పెల్లి గ్రామానికి చెందిన గాడేకర్​ సంకీర్తన ఇటీవల నీట్ లో ర్యాంకు సాధించి హైదరాబాద్​లోని మల్లారెడ్డి కాలేజీలో మెడికల్ సీటు సాధించిన విషయం తెలిసిందే. నిరుపేద కుటుంబం కావడంతో ‘వెలుగు’ దినపత్రికలో ఇటీవల ‘సరస్వతి కరుణించినా.. లక్ష్మి కటాక్షం కరువైంది..’  అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందిస్తున్న దాతులు ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. శనివారం కుభీర్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రూ. 30 వేలు అందించారు. కార్యక్రమంలో సర్పంచ్​రాజేందర్, సభ్యులు ప్యాట లక్ష్మణ్, మారుతి, పోతన్న, గంగాధర్, దిలీప్ కుమార్, దత్తాత్రి, శంకర్, సురేశ్, శ్రీనివాస్, గంగాధర్, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ లీడర్​ను పరామర్శించిన ఎంపీ

లోకేశ్వరం,వెలుగు: మండల బీజేపీ సీనియర్ లీడర్​నగర్ నారాయణరెడ్డి భార్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందింది. శనివారం ఆదిలాబాద్​ఎంపీ ఎంపీ సోయం బాపూరావు ఆయనను పరామర్శించారు. ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట లీడర్లు బద్దం భోజారెడ్డి, దడిగె భోజన్న, రాజేశ్ బాబు, వేణు సెట్, జీవీ రమణ తదితరులు ఉన్నారు.

43 ఏండ్లకు కలుసుకున్రు

కాగజ్​నగర్​హైస్కూల్​లో 1978–79 సంవత్సరంలో పదోతరగతి చదువుకున్న పదో తరగతి విద్యార్థులు శనివారం ఒకచోట కలుసుకున్నారు. పాతజ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. ఆటపాటతో ఏంజాయ్​చేశారు. తన క్లాస్​మేట్లకు జడ్పీ వైస్​చైర్మన్ కోనేరు కృష్ణారావు ఏర్పాట్లు చేశారు. -కాగజ్ నగర్,వెలుగు

జాతీయ స్థాయి షూటింగ్​బాల్​పోటీలు ప్రారంభం 

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: ఆదిలాబాద్​లో ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శనివారం జాతీయ స్థాయి అండర్​19 షూటింగ్​ బాల్  పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీలను ఎమ్మెల్యే జోగు రామన్న ప్రారంభించారు. ఈ పోటీలకు 14 రాష్ట్రాల క్రీడాకారులు హాజరయ్యారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ గోడం నగేశ్, సెక్రటరీ జనరల్ ఉత్తంసింగ్, షూటింగ్ బాల్​ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ సాయిని రవి పాల్గొన్నారు.