
బీజింగ్: హెచ్1 బీ వీసాలపై అమెరికా రుసుమును భారీగా పెంచిన నేపథ్యంలో యంగ్టాలెంట్ను ఆకర్షించేందుకు చైనా కీలక నిర్ణయం తీసుకున్నది. సైన్స్అండ్టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్) రంగాల్లో ప్రతిభావంతుల కోసం కొత్తగా ‘కే’ వీసాను తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు విదేశీయుల ఎంట్రీ, ఎగ్జిట్‌నిర్వహణ నిబంధనలను సవరించే డిక్రీపై ఆ దేశ ప్రధాని కీ లియాంగ్సంతకం చేశారు. మీడియా కథనాల ప్రకారం.. ఈ కొత్త నిబంధనలు వచ్చే నెల ఒకటో తేదీనుంచి అమల్లోకి రానున్నాయి.
అమెరికాలో హెచ్-1బీ వీసాపై నెలకొన్న గందరగోళ పరిస్థితుల మధ్య చైనా తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించకున్నది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ దరఖాస్తుదారులపై లక్ష డాలర్ల (సుమారు రూ. 88 లక్షలు) వార్షిక రుసుమును విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దక్షిణాసియా దేశాలు.. ముఖ్యంగా ఇండియాలాంటి కంట్రీస్ నుంచి ఇంజినీరింగ్, టెక్ నిపుణులను తనవైపు తిప్పుకునేందుకు చైనా సరళీకృత వీసా విధానం తీసుకొచ్చినట్టు కనిపిస్తున్నది.
‘కే’ వీసా ప్రత్యేకతలివే..
చైనాలో ప్రస్తుతం జారీ చేస్తున్న 12 సాధారణ వీసా రకాలకు ‘కే’ వీసాను కూడా జోడించింది. ఆ 12 వీసాలతో పోలిస్తే ఇది మల్టీ ఎంట్రీ, సుదీర్ఘ కాల పరిమితి, అలాగే దేశంలో ఎక్కువ కాలం ఉండే సౌలభ్యాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. వర్క్ వీసాల మాదిరిగా కాకుండా ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారికి చైనాలో పనిచేసే ఒక సంస్థ నుంచి ఆహ్వానం అవసరంలేదు.
చైనాలో ప్రవేశించిన తర్వాత ‘కే’- వీసా హోల్డర్లు వ్యాపార కార్యకలాపాలతోపాటు ఎడ్యుకేషన్, కల్చరల్, సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటి రంగాల్లో కూడా పాల్గొనడానికి అనుమతిస్తారు. నిర్దిష్ట వయస్సు, విద్య, వర్క్ ఎక్స్‌పీరియెన్స్‌కు సంబంధించిన అర్హతలు ఉన్నవారికి ఆహ్వానం లేకుండానే అప్లికేషన్ ప్రక్రియ సులభతరం అవుతుంది.
ఎవరు అర్హులంటే..?
‘కే’ వీసాకు దరఖాస్తు చేసుకునేందుకు కావాల్సిన అర్హతలను చైనా న్యాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ వర్సిటీలు, రీసెర్చ్ సంస్థల్లో స్టెమ్ రంగాల్లో బ్యాచిలర్స్, ఆపై డిగ్రీలు చేసిన యువత ఈ వీసాకు అర్హులు. ప్రముఖ సంస్థల్లో టీచింగ్, రీసెర్చ్ చేస్తున్న యువ నిపుణులకు కూడా ఈ వీసాను జారీ చేస్తారు. దరఖాస్తుదారులు చైనా అధికారులు నిర్దేశించిన అర్హతలు, అవసరాలను తప్పనిసరిగా నెరవేర్చాలి.
వీసా ఫీజులు సున్నా.. యూకే సమాలోచన..!
హెచ్1బీ వీసా ఫీజును అమెరికా భారీగా పెంచిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న యంగ్ టాలెంట్‌ను దేశంలోకి ఆకర్షించేందుకు యూకే కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తున్నది. ప్రముఖ సైంటిస్టులు, విద్యావేత్తలు, డిజిటల్ నిపుణులకు వీసా ఫీజులను రద్దు చేసే ప్రతిపాదనలపై ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్ ఆలోచిస్తున్నారు. ప్రపంచంలోని టాప్ 5 వర్సిటీల్లో చదువుకున్న లేదా ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్న వ్యక్తులకు వీసా ఖర్చులను పూర్తిగా మాఫీ చేసేందుకు స్టార్మర్‌కు చెందిన ‘‘గ్లోబల్ టాలెంట్ టాస్క్ ఫోర్స్” చర్చిస్తున్నది.
యూకే గ్లోబల్ టాలెంట్ వీసా కోసం ఒక్కొక్కరికి 766 పౌండ్లు (దాదాపు 90వేలు) ఖర్చవుతుంది. నిపుణులు వారి భార్య, పిల్లలకూ ఇదే ఫీజు వర్తిస్తుంది. దరఖాస్తుదారులు 1,035 పౌండ్లు (లక్షా 13 వేలు) వార్షిక హెల్త్‌కేర్ సర్ చార్జ్‌ను అదనంగా చెల్లించాలి. కాగా, ఈ వీసా ఖర్చులను సున్నాకి తగ్గించే ఆలోచన తాము చేస్తున్నామని ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు.