Comedian Ali : పవన్ కళ్యాణ్పై పోటీకి సిద్ధం

Comedian Ali : పవన్ కళ్యాణ్పై పోటీకి సిద్ధం

సినీ నటుడు, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పోటీకి సిద్ధమని ప్రకటించారు. సీఎం ఆదేశిస్తే ఎవరి మీదనైనా పోటీ చేస్తానని అలీ స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ తనకు మంచి మిత్రుడేనన్న ఆయన.. స్నేహం వేరు రాజకీయాలు వేరు అని చెప్పారు. రాష్ట్రానికి ఎవరు మేలు చేస్తారో ప్రజలకు తెలుసని అన్నారు. పాలిటిక్స్ లో విమర్శలు, ప్రతి విమర్శలు సాధారణమని.. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని చెప్పారు.

చిత్తూరు జిల్లా నగరిలో పర్యటించిన అలీ.. డైమండ్ రోజా అంటూ పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లపై స్పందించారు. డైమండ్ చాలా పవర్ ఫుల్, విలువైనదన్న ఆయన.. నగరిలో రోజా మరోసారి గెలవడం ఖాయమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175కిగానూ 175 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పవన్పై అలీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.