మీ దరిద్రపు వార్తలతో నన్ను చంపకండి : నటుడు సుధాకర్

మీ దరిద్రపు వార్తలతో నన్ను చంపకండి : నటుడు సుధాకర్

టాలీవుడ్ సీనియర్ కమెడియన్ సుధాకర్ చనిపోయరంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వైరల్ అయ్యాయి. పలు మీడియా సంస్థలు కూడా ఆయన కన్నుమూశారంటూ వార్తలు ప్రసారం చేసాయి. దీంతో ఆ వార్తలను ఖండిస్తూ సుధాకర్ ఓ వీడియోలో బైట్ విడుదల చేశాడు. " తాను ఆరోగ్యంగానే ఉన్నానని, సంతోషంగా ఉన్నానని తెలిపారు. దయచేసి తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని కోరారు. 

"అందరికీ నమస్కారం. నా మీద వచ్చినవి ఫేక్ న్యూస్. తప్పుడు సమాచారాన్ని నమ్మకండి. అలాంటివి స్ప్రెడ్ చేయకండి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఐ యామ్ వెరీ హ్యాపీ" అని సుధాకర్ వీడియో ద్వారా చెప్పుకొచ్చారు. దీంతో ఆయన చనిపోయాడంటూ వస్తున్న ఫేక్ వార్తలకు చెక్ పడింది. 

ఇక సుధాకర్ పై ఇలాంటి ఫేక్ వార్తలను ప్రచారం చేయడంపై సినీ ప్రముఖలు, ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రతికున్న మనిషిని చనిపోయాడని చెప్పడం సరికారంటూ కామెంట్స్ చేస్తున్నారు.