
నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యాన్ లీడ్ రోల్స్‌లో నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’. కళ్యాణ్ శంకర్ దర్శకుడు. నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. మంగళవారం ఉదయం ట్రైలర్‌ను ఎన్టీఆర్ విడుదల చేసి టీమ్‌కి బెస్ట్ విషెస్ చెప్పారు.
అక్టోబర్ 6న సినిమా విడుదలవుతున్న సందర్భంగా సంగీత్ శోభన్, రామ్ నితిన్, గోపికా ఉద్యన్ సినిమా విశేషాల గురించి మాట్లాడుతూ ‘కొత్తగా కాలేజీకి వచ్చిన కొందరు స్టూడెంట్స్ లైఫ్‌లో ఎదురైన అనుభవాలే ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్. ఈ జనరేషన్‌కి కనెక్ట్ అయ్యేలా తీసిన కామెడీ ఎంటర్‌టైనర్ ఇది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్‌లలో ఎంజాయ్ చేసే కామెడీ ఇందులో ఉంటుంది. కాలేజ్ సెటప్ అనేది కామన్.
కానీ కామెడీ మాత్రం ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా కొత్తగా ఉంటుంది. ప్రేక్షకులను పిచ్చెక్కించే కామెడీ ఉన్న సినిమా కనుక ఈ టైటిల్ పెట్టారు. మంచి చిత్రానికి మ్యాడ్ అనేది ఒక కాంప్లిమెంట్. ‘డీజే టిల్లు’ దర్శకుడు విమల్ కృష్ణ ఈ మూవీ స్క్రిప్ట్ విని ‘మ్యాడ్’ అన్నాడు. అలా ఈ టైటిల్‌ని తీసుకున్నారు. సినిమాలోని పాత్రల మధ్య కెమిస్ట్రీ, ఫ్రెండ్‌షిప్ చూడటానికి చాలా సరదాగా ఉంటుంది. థియేటర్‌లో కచ్చితంగా నవ్వుల హంగామా ఉంటుంది’ అన్నారు.