4 ట్రక్స్​ను లాంచ్​ చేసిన ఐషర్​

4 ట్రక్స్​ను లాంచ్​ చేసిన ఐషర్​

కమర్షియల్​ ఆటోమొబైల్ కంపెనీ ఐషర్ కొత్త హెవీ డ్యూటీ ట్రక్కుల ఐషర్ నాన్-స్టాప్ సిరీస్‌‌‌‌ను లాంచ్​ చేసింది. వీటిలో నాలుగు కొత్త హెవీ డ్యూటీ ట్రక్కులు ఉంటాయి. ఇవన్నీ ఫ్లీట్ కంపెనీలకు అనువుగా ఉంటాయి. వీటి ఇంజన్లు భారీ మైలేజీని ఇస్తాయని కంపెనీ తెలిపింది. వీటిలో ఐషర్ ప్రో 6019ఎక్స్​పీటీ టిప్పర్, ఐషర్ ప్రో6048ఎక్స్​పీ హాలేజ్ ట్రక్, ఐషర్ ప్రో 6055ఎక్స్​పీ,  ఐషర్ ప్రో 6055ఎక్స్​పీ 4x2 ట్రాక్టర్-ట్రక్కులు ఉంటాయి.