కమర్షియల్ LPG, ATFపై ధరల బాదుడు.. హోటళ్ల నుంచి విమాన ప్రయాణాల వరకు ఎఫెక్ట్!

కమర్షియల్ LPG, ATFపై ధరల బాదుడు.. హోటళ్ల నుంచి విమాన ప్రయాణాల వరకు ఎఫెక్ట్!

న్యూఢిల్లీ: హోటళ్లలో, రెస్టారెంట్లలో వాడే19 కిలోల కమర్షియల్ ఎల్​పీజీ సిలిండర్ ధర రూ.62.50 పెరిగింది.  దీని ధరలు జులై, ఆగస్టు నెలల్లో దాదాపు రూ.375 వరకు తగ్గినా, సెప్టెంబర్ నుంచి మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి.  విమాన ఇంధనం (ఏటీఎఫ్) లీటరు ధర రూ.16 పెరిగి రూ.137 కి చేరింది. ఆయా రాష్ట్రాల పన్నుల ఆధారంగా ఈ ధరల్లో తేడాలుంటాయి. సెప్టెంబర్ లో లీటరుపై రూ.6.28, ఆగస్టులో రూ.5 చొప్పున ఏటీఎఫ్ ధర పెరిగింది. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయంలో 40 శాతం వరకు ఇంధనానికే ఖర్చవుతుంది.  వీటి ధరల పెరుగుదల విమాన ప్రయాణ చార్జీలపై ప్రభావం చూపే అవకాశముంది.   డాలర్ తో రూపాయి మారకం విలువ, క్రూడ్ ఆయిల్ రేట్లలో వచ్చే మార్పుల ఆధారంగా ప్రతి నెల ఒకటో తేదీన వీటి ధరలను మార్చుతారు.