
న్యూఢిల్లీ: అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలు తగ్గడంతో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధర 1.4 శాతం, వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 51.50 తగ్గాయి. ఢిల్లీలో జెట్ ఇంధనం (ఏటీఎఫ్) ధర కిలోలీటరుకు రూ. 1,308.41 తగ్గి రూ. 90,713.52కి చేరింది.
వాణిజ్య విమానయాన సంస్థలకు ఆపరేటింగ్ ఖర్చులో 40 శాతం వరకు ఇంధనమే ఉంటుంది. హోటళ్లు, రెస్టారెంట్లలో ఉపయోగించే వాణిజ్య ఎల్పీజీ ధరను 19- కిలోల సిలిండర్‌కు రూ. 51.50 తగ్గించారు. దీంతో జాతీయ రాజధానిలో వాణిజ్య ఎల్పీజీ ధర రూ. 1,580కి చేరింది. ఇది వరుసగా ఆరో తగ్గింపు. గత ఆరు తగ్గింపుల్లో ఈ ధరలు రూ. 223 మేర తగ్గాయి. సాధారణ 14.2-కిలోల సిలిండర్ ధర (రూ. 853) మారలేదు.