భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు..

భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు..

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కాస్త చల్లబడటం.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గటంతో.. ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు దిగివస్తు్న్నాయి. ఈ ప్రభావంతో గ్యాస్ సిలిండర్ ధరలు కూడా భారీగా తగ్గాయి. ఆయిల్ కంపెనీలు నెలవారీ రివిజన్ లో భాగంగా గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా తగ్గించాయి. తగ్గిన ధరలు ఇవాళ్టి (2025, జులై 01) నుంచి అమలులోకి వస్తున్నాయి. 

అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గటంతో గ్యాస్ ధరలు తగ్గుతున్నాయి. ఆయిల్ కెంపెనీలు రివైజ్ చేసిన ధరల ప్రకారం.. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ పై రూ.58.50 తగ్గింది. దీంతో హోటల్స్, రెస్టారెంట్స్, చిరు వ్యాపారులకు ఉపశమనం లభించనుంది. అయితే గృహావసరాలకు (డొమెస్టిక్) వాడుకునే సిలిండర్ ధరలపై ఎలాంటి మార్పు లేదు. 

లేటెస్ట్ రివిజన్ ప్రకారం.. ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1665 గా ఉంది. ఇక ముంబై లో ₹1,616, కోల్ కతాలో ₹1,769, చెన్నై లో ₹1,823.50 గా ఉంది. 

మరోవైపు ఆయిల్ కంపెనీలు ప్రభుత్వ ఆదేశాల మేరకు లైఫ్ టైమ్ కంప్లీట్ అయిన వెహికిల్స్ కు పెట్రోల్, డీజిల్ కొట్టడం ఆపేశాయి. ఢిల్లీలో ఇవాళ్టి నుంచి అమలు లోకి వచ్చింది. 15 ఏండ్లకు ముందు కొన్న పెట్రోల్ బండ్లకు, అదే విధంగా 10 ఏండ్లకు ముందు కొన్న డీజిల్ బండ్లకు ఫుయెల్ కొట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.