టానిక్ లిక్కర్ మాల్స్ పై ట్యాక్స్ అధికారుల దాడులు

టానిక్ లిక్కర్ మాల్స్ పై ట్యాక్స్ అధికారుల దాడులు

టానిక్.. ఈ టైటిల్ వినగానే పిల్లలకు పోసే దగ్గు, జలుబు మందు టానిక్ అనుకునేరు.. హైదరాబాద్ సిటీలో టాప్ లెవల్ లిక్కర్ దొరికే లిక్కర్ మాల్స్ టానిక్.. దేశ, విదేశాలకు చెందిన బ్రాండెడ్ లిక్కర్, వెరైటీ వెరైటీ వైన్, జిన్ను, విస్కీ, బ్రాందీ వంటి మద్యం ఈ మాల్స్ లో దొరుకుతుంది. సిటీ వ్యాప్తంగా 11 టానిక్ లిక్కర్ మాల్స్ ఉన్నాయి.

వీటిపై ఇప్పుడు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు నిఘా పెట్టారు. ఐదేళ్ల క్రితం స్టార్ట్ అయిన ఈ టానిక్ లిక్కర్ మాల్స్ వ్యాపారం.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో చక్కగా సాగింది.. 11 బ్రాంచీల వరకు విస్తరించింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే.. పన్నుల ఎగవేతకు సంబంధించి కమర్షియల్ ట్యాక్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు.

టానిక్ లిక్కర్ గ్రూప్స్ వాటి అనుబంధ సంస్థల్లోనూ తనిఖీలు చేశారు. టానిక్ లిక్కర్ గ్రూప్స్  రూల్స్ పాటించడం లేదని.... ఏకకాలంలో 11 చోట్ల అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. 

Also Read : మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్లో ఉద్రిక్తత