
వరంగల్ సిటీ, వెలుగు: క్షేత్ర స్థాయిలో పారిశుద్ధ్య సిబ్బంది పనితీరు పర్యవేక్షణ బాధ్యత జవాన్లదేనని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. 4,5,6 డివిజన్‌ల పరిధిలోని టైలర్ స్ట్రీట్, కుమార్ పల్లి మార్కెట్ , రెడ్డిపురం , పెగడపల్లి డబ్బాలు ప్రాంతాల్లో గురువారం కమిషనర్ క్షేత్రస్థాయిలో పర్యటించి శానిటేషన్ నిర్వహణ తీరును అధికారులను అడిగి తెలుసుకొన్నారు.
కమిషనర్ సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ ను పరిశీలించారు. శానిటేషన్ తోపాటు ట్రేడ్ కలెక్షన్ చేసే బాధ్యత జవాన్లదేనని చెప్పారు. జవాన్లకు కేటాయించిన ఏరియాలో ట్రేడ్ లైసెన్స్ లేకుండా దుకాణాలు నడిపితే సంబంధిత జవాన్ పెనాల్టీ చెల్లించాలన్నారు. చీఫ్ మున్సిపల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డా.రాజారెడ్డి, శానిటరీ సూపర్ వైజర్ నరేందర్, ఏఈ హరికుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ లు అనిల్, ప్రకాశ్ జవాన్లు పాల్గొన్నారు.