ఇమ్యూనిటీని తగ్గించే కామన్​ ఫుడ్స్

ఇమ్యూనిటీని తగ్గించే కామన్​ ఫుడ్స్

ఇమ్యూనిటీ పెంచుకునేందుకు, హెల్దీగా ఉండేందుకు ఏమేం తినాలో అన్నీ తింటున్నారు. అయితే  రోజూ తినే  కొన్ని ఫుడ్స్​ ఇమ్యూనిటీని తగ్గిస్తాయట. అందుకే ఆరోగ్యం కోసం ఏవి తక్కువ తినాలో, వేటిని పూర్తిగా మానేయాలో తెలుసుకోవడం ముఖ్యం అంటున్నారు న్యూట్రిషనిస్ట్​లు. 
చక్కెర ఎక్కువ
టీ, కాఫీలో చక్కెర వేశాక కూడా కొందరు తీపి సరిపోలేదని ఇంకొంచెం వేసుకుంటారు. అయితే అదనపు చక్కెర ఉన్న ఫుడ్స్​ రక్తంలో చక్కెర మోతాదు పెంచుతాయి. దాంతో ఇమ్యూనిటీ మీద నెగెటివ్​ ఎఫెక్ట్​ చూపే ఇన్​ఫ్లమేటరీ ప్రొటీన్లు ఉత్పత్తి అవుతాయి.  బ్లడ్​ షుగర్​ ఎక్కువైతే​ జీర్ణాశయంలోని బ్యాక్టీరియాకు హాని చేస్తుంది. దాంతో జీర్ణక్రియ దెబ్బతింటుంది. తొందరగా ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంది.
సాల్ట్
ప్యాకేజ్డ్​ చిప్స్, బేకరీ ఐటమ్స్​​లో ఉప్పు ఎక్కువ ఉంటుంది. బాడీలో సాల్ట్ ఎక్కువ ఉంటే ఇన్​ఫ్లమేషన్​కు కారణమవుతుంది. ఆటోఇమ్యూన్​ డిసీజ్​లు వచ్చే ఛాన్స్​ ఉంది. ఉప్పు ఇమ్యూనిటీ వ్యవస్థ పనితీరును  తగ్గిస్తుంది. యాంటీ–ఇన్​ఫ్లమేటరీ రెస్పాన్స్​ను తగ్గిస్తుంది. 
ఫ్రైడ్​ ఫుడ్స్​
ఫ్రెంచ్​ ఫ్రై, పొటాటో చిప్స్​, చికెన్​ ఫ్రై వంటి ఫ్రైడ్​ ఫుడ్స్​లో చక్కెర కలిసిన ప్రొటీన్స్​,​ లిపిడ్స్​ ఎక్కువ ఉంటాయి. ఇవి ఇన్​ఫ్లమేషన్​, కణాలను దెబ్బతీస్తాయి. దాంతో శరీరంలోని యాంటీ ఆక్సిడెంట్​ సిస్టమ్ నెమ్మదిగా పనిచేస్తుంది.  
కెఫిన్​
 కెఫిన్​ ఉన్న డ్రింక్స్​ ఎక్కువగా తాగితే నిద్రకు సంబంధించిన సమస్యలు వస్తాయి. దాంతో ఇన్​ఫ్లమేషన్​ పెరుగుతుంది. చక్కెర, ఆర్టిఫీషియల్​ స్వీట్​నర్స్​ ఉండే కూల్​డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్​లో న్యూట్రియెంట్స్​ అస్సలు ఉండవు.