కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్) 2024 ఫలితాలు విడుదల

కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్) 2024 ఫలితాలు విడుదల

కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్)- 2024  ఫలితాలు విడుదలయ్యాయి.  డిసెంబర్ 10వ తేదీ ఆదివారం కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ (సీఎన్ఎల్‌యూ) ఈ ఫలితాలను విడుదల చేసింది.  క్లాట్ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డు నంబర్, పుట్టిన తేదీ వివరాలతో స్కోర్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. https://consortiumofnlus.ac.in/clat-2024/view-result.html

 అడ్మిషన్, కౌన్సెలింగ్ వివరాలను డిసెంబర్ 11వ తేదీ సోమవారం అధికారులు వెల్లడించనున్నారు. నేషనల్‌ లా యూనివర్సిటీల్లో బీఏ ఎల్‌‌ఎ‌ల్‌బీ, ఎల్‌‌ఎ‌ల్‌ఎం కోర్సుల్లో ప్రవే‌శాల కోసం దేశవ్యాప్తంగా 139 కేంద్రాల్లో ఈనెల 3న పరీక్ష జరిగిన విషయం తెలిసిందే.